
కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జయహో అంటూ విద్యార్థినులు
సాక్షి, కడప: 99480 20786 ఈ మోబైల్ నెంబర్ సాధాసీదా నెంబర్ కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీసంక్షేమశాఖ మంత్రి ఎస్.బి. అంజద్‌బాషాది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల నెంబర్లు తెలుసుకోవడమంటే కాస్త కష్టమే. ఒకవేళ తెలిసినా.. వారు పనిచేయని, లిఫ్ట్ చేయని నెంబర్ ఇవ్వడం చాలా మందికి అనుభవమే. అయితే వీరిందరికీ భిన్నంగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, ఇందుకోసం తామంతా అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటామంటూ.. సిసలైన ప్రజాప్రతినిధి అనిపించారు.. ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్‌బాషా.
గురువారం కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన ఆయన విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు సమస్యలను తెలిపారు. దీంతో పాటు మరికొన్ని సమస్యలున్నాయంటూ చెప్పేందుకు విద్యార్థినులు సంశయించగా, వెంటనే ఆయన స్పందించి నా మొబైల్ నెంబర్ 99480 20786.. ఏ సమస్య ఉన్నా నేరుగా నాతోనే చెప్పండి అంటూ రెండుసార్లు నెంబర్ చెప్పి అందరూ నోట్ చేసుకున్న తర్వాత కార్యక్రమం కొనసాగించారు. దీంతో విద్యార్థినులందరూ జగనన్న ప్రభుత్వంలో మంత్రులు ఇంత పారదర్శకంగా ప్రజలకోసం పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందంటూ జయజయధ్వానాలతో సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment