
కడప అర్బన్ : కడపకు చెందిన ఓ మహిళ శనివారం అర్ధరాత్రి– ఆదివారం తెల్లవారుజామున మధ్య సమయంలో దేవుని కడప చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఆటోడ్రైవర్ రమేష్, నాగరత్న (34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శనివారం రాత్రి భార్య, భర్త గొడవపడి.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులు పలు రకాలుగా తెలియజేస్తున్నారు. అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక భర్త, కుటుంబ సభ్యులతో గొడవపడి, వారి వేధింపులు తాళలేక ఈ చర్యలకు పాల్పడి ఉంటారా? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ సీఐ కె.అశోక్‌రెడ్డి తెలిపారు.