కడప: వైఎస్ఆర్ సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. కడప జిల్లాలోని నందలూరు మండలం చింతకాలయపల్లిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.