ఆన్‌లైన్‌ పరిచయం.. ఎప్పుడూ ఫోన్‌ చేస్తుండేవాడు.. కానీ సడన్‌గా.. | Girl Suicide Harassment Over Online Friend Karnataka | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పరిచయం.. అసభ్యకర వీడియోలను అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించడంతో..

Published Sun, Apr 10 2022 3:08 PM | Last Updated on Sun, Apr 10 2022 3:37 PM

Girl Suicide Harassment Over Online Friend Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివమొగ్గ(బెంగళూరు): సోషల్‌ మీడియాలో పరిచయమైన అపరిచిత యువకుడు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నాడని ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శికారిపుర తాలూకా శిరాళకొప్పలో జరిగింది. బీఏ చదువుకున్న 23 ఏళ్ల యువతికి ఇన్‌స్టా గ్రామ్‌లో అపరిచిత వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎప్పుడూ ఫోన్‌ చేస్తుండేవాడు. యువతి నగ్న వీడియో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించేవాడు. అతని వేధింపులకు భయపడిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఊపిరి తీసుకుంది. శిరాళకొప్ప పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

మరో ఘటనలో..

బస్సు, బైక్‌ ఢీ 
దొడ్డబళ్లాపురం: మంగళూరు పట్టణంలోని హంపనకట్టె సిగ్నల్‌ వద్ద శుక్రవారం బస్సు, బైక్‌ ఢీకొని రెండు వాహనాలూ దగ్ధమైన సంఘటనలో ప్రయాణికులు అందరూ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. శుక్రవారం హంపనకట్టె సిగ్నల్‌ వద్ద వేగంగా వస్తున్న ఆసెల్‌ సిటీ బస్సుకి బైక్‌ చోదకుడు అడ్డంగా వెళ్లాడు. ఈ సంఘటనలో రెండు వాహనాలకూ మంటలు రాజుకుని నడిరోడ్డులో కాలిపోయాయి.  బస్సులో మంటలు చెలరేగగానే కండక్టర్‌ ప్రయాణికులను కిందకు దించేసాడు. ఈ ప్రమాదంలో బైక్‌ చోదకుడు మాత్రం గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళూరు సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

చదవండి: అర్ధరాత్రి ఇంటికి ప్రియుడు వచ్చి.. ఆ సమయంలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement