కేరళలో టీచర్ వేధింపులకు మరో విద్యార్థిని బలైంది. పాఠశాల భవనం మూడో అంతస్థునుంచి దూకి పదవ తరగతి విద్యార్థిని (15)ఆత్మహత్యకు పాల్పడింది. కొల్లాయం లోని ట్రినిటీ లైసియం పాఠశాలలో ఈ విషాదం చోటు చేసుకుంది.
క్లాస్‌లో మాట్లాడిందన్న కారణంతో విద్యార్థిని అబ్బాయిలతో కూర్చోవాలన్న పనిష్‌మెంట్ ఇచ్చింది టీచర్. దీంతో బాధిత విద్యార్థిని ఉపాధ్యాయులతో వాదనకు దిగింది. అలాగే ఈ వ్యవహారంపై ఆమె తల్లి కూడా కేసు నమోదు చేస్తామంటూ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన టీచర్లు మళ్లీ ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు.
ఈ ఉదంతంలో విద్యార్థిని సోదరి సహవిద్యార్థులు, ఇతర విద్యార్థులు వేళాకోళం చేయడంతో మనస్తాపానికి గురైన మైనర్ బాలిక భవనం నుంచి దూకేసింది. వెంటనే ఆమెను స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వేధింపుల వివాదం అలా ముగిసేలోపే.. ఆమె అనూహ్యంగా ఉసురు తీసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశామని విచారణ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment