పూజా.. నువ్వెక్కడ! | intermediate student puja goes missing | Sakshi

పూజా.. నువ్వెక్కడ!

Published Mon, Nov 16 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

మహానగరంలో మరో బాలిక అదృశ్యమైంది. కాచిగూడాలోని నింబోలి అడ్డాకు చెందిన సి. పూజ (16) అనే ఇంటర్ విద్యార్థిని రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయింది.

- కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన విద్యార్థిని

హైదరాబాద్:
మహానగరంలో మరో బాలిక అదృశ్యమైంది. కాచిగూడాలోని నింబోలి అడ్డాకు చెందిన సి. పూజ (16) అనే ఇంటర్ విద్యార్థిని రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయింది. కాలేజీకి వెళ్లొస్తానంటూ 14వ తేది ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పూజ.. రోజులు గుడుస్తున్నప్పటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

తెలిసినవారి ఇళ్లు, వివిధ ప్రాంతాల్లో ఎంతగా గాలించినప్పటికీ పూజ జాడ తెలియరాలేదు. దీంతో పూజ తండ్రి మధుకర్.. సోమవారం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ స్పెక్టర్ డి. రాజ్ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని బాలిక కోసం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement