పరీక్షకెళ్లి విద్యార్థి అదృశ్యం | intermediate student missing | Sakshi
Sakshi News home page

పరీక్షకెళ్లి విద్యార్థి అదృశ్యం

Published Fri, Mar 20 2015 6:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

intermediate student missing

హైదరాబాద్ : పరీక్ష రాసేందుకు వెళుతున్నానని చెప్పివెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ ద్వారకనగర్‌కు చెందిన బెండ రాజు, రాధల కుమారుడు సాయి కిరణ్(17)  ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.

గురువారం అతడు తానుపరీక్షకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినప్పటికీ విద్యార్థి ఇంటికి తిరిగిరాలేదు. సాయి కిరణ్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement