ప్రిన్సిపాల్‌కు బడితపూజ | student's parents beat up principal | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌కు బడితపూజ

Published Sat, Mar 21 2015 2:48 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

ప్రిన్సిపాల్‌కు బడితపూజ - Sakshi

ప్రిన్సిపాల్‌కు బడితపూజ

నల్గొండ: ఇంటర్ విద్యార్థినికి అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ ప్రిన్సిపాల్‌కు శనివారం దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి అదే కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధిని సెల్‌ఫోన్‌కి గత కొంతకాలంగా అసభ్యకర ఫోటోలు, మెసేజ్‌లు పంపుతున్నాడు. అయితే విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలుపడంతో విద్యార్థిని బంధువులు ప్రిన్సిపాల్‌ను కొట్టి పోలీసులకు అప్పగించారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement