ప్లస్‌టూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోవై వాల్‌పారై అయ్యర్ పాడికి చెందిన విఘ్నేశ్వరన్ (21). వాల్‌పారై పోలీస్‌స్టేషన్ యువజన దళంలో పనిచేస్తున్నారు. ఇతను కవర్‌కల్ ఎస్టేట్‌కు చెందిన ప్లస్-2 విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్టు విద్యార్థిని తల్లిదండ్రులు వాల్‌పారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలించారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొల్లాచ్చి బస్సు నిలయంలో నిలబడివున్న విఘ్నేశ్వరన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతనితో ఉన్న విద్యార్థినిని విడిపించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. ఆ విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 11వ తేదీ వాల్‌పారై గాంధీ విగ్రహం సమీపంలో నిలబడి ఉన్న తనను విఘ్నేశ్వరన్ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తరువాత లాడ్జిలో తనపై లైంగికదాడి చేశాడని తెలిపింది. విఘ్నేశ్వరన్‌పై పోలీసులు అరెస్టు చేసి కోవై జైలుకు తరలించారు.