మత్తుమందు వాసన చూపి బాలికపై లైంగిక దాడి | Intermediate student gang raped in Hyderabad | Sakshi
Sakshi News home page

మత్తుమందు వాసన చూపి బాలికపై లైంగిక దాడి

Published Tue, Jan 14 2014 5:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మత్తుమందు వాసన చూపి బాలికపై లైంగిక దాడి - Sakshi

మత్తుమందు వాసన చూపి బాలికపై లైంగిక దాడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓ మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం..  మలక్‌పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను హయత్‌నగర్ మండలం మన్నెగూడ చౌరస్తా వద్ద బస్సు దిగాలని లేకుంటే యాసిడ్ పోసి హతమారుస్తామని బొంగులూరు గ్రామానికి చెందిన సాయి (17) గత డిసెంబర్ 21న ఆమె మొబైల్‌కు మెసేజ్ పంపాడు. దీంతో భయపడిన ఆ బాలిక మన్నెగూడ చౌర స్తా వద్ద బస్సు దిగింది. అక్కడే ఉన్న సాయి, అతడి మిత్రుడు మణికిరణ్ (18)లు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నిర్జనప్రదేశానికి తీసుకువెళ్లారు.
 
  మార్గమధ్యంలోనే మత్తుమందులో ముంచిన రుమాలుతో ఆమెకు వాసన చూపించడంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపారు. కొద్దిసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన బాలిక గొడవ చేయడంతో బైక్‌పై తిరిగి తీసుకువస్తుండగా దారిలో గస్తీ పోలీసులు కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. బొంగులూరుకు చెందిన మొబైల్‌షాప్ యజమాని శ్రీనివాస్ వచ్చి తనకు పరిచయస్తులని చెప్పడంతో పోలీసులు వారిని వదిలేశారు. కాగా, బాలిక తల్లి అప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. అయితే, ఆదివారం నిమ్స్ నుంచి తల్లి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రి భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై నిర్భయ చట్టంతో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్సువల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement