దోమకొండ: ఆకతాయిల వేధింపులకు ఇంటర్మీడియెట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేటకి చెందిన మంగళపల్లి భవ్యశ్రీ(18) కామారెడ్డిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లేది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా ఇంటర్ చదువుతూ కామారెడ్డి వెళుతున్నారు. వీరు ప్రతిరోజు భవ్యశ్రీని వేధించేవారు.
గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు మృతురాలి ఇంటి సమీపంలోకి వచ్చారు. దీంతో భవ్యశ్రీ సోదరుడు భరత్‌కు వారికి మధ్య గొడవ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం పరువు పోతోందని భవ్యశ్రీ మనస్థానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. తమ కూతురు మృతికి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే కారణమని మృతురాలి తల్లితండ్రులు గోవర్ధన్, మాధవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రినిటీ కాలేజీలో40 మందికి అస్వస్థత
కరీంనగర్: కరీంనగర్‌లోని ట్రినిటీ జూనియర్ కళాశాల (ఏసీ క్యాంపస్)లో శుక్రవారం బాలల దినోత్సవరం సందర్భంగా 40 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వేడుకల్లో కేక్‌కట్ చేసినప్పుడు కొంతమంది పెప్పర్ స్ప్రే వాడినట్లు పేర్కొంటున్నారు. కళాశాల ల్యాబ్‌లో గురువారం సాయంత్రం వరకు విద్యార్థులు ప్రయోగాలు చేశారని... అక్కడ వాడిన పరికరాలు, రసాయనాలు తొలగించకుండా ఉన్నాయని, రసాయన పదార్థాలు వినియోగించిన ప్లాస్కు కిందపడి పగలడంతో ఒక్కసారిగా పొగవచ్చి విషవాయువు ప్రబలిందని మరికొందరు అంటున్నారు.
యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యం గా ఉంచింది. అస్వస్థతకు గురైన వారిని నగరంలోని అపోలోరీచ్, సన్‌రైజ్ ఆస్పత్రుల్లో చేర్పిం చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘా ల నాయకులు కళాశాల క్యాంపస్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని అపోలోరీచ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ బాబురావు తెలిపారు.
ఆకతాయిల వేధింపులకు విద్యార్థిని బలి
Published Sat, Nov 15 2014 2:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement