Bhavyasri
-
‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు అనంతపురం బస్టాండు సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని భవ్యశ్రీ వివరించింది. విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవ్యశ్రీని పోలీసులు విచారణ చేస్తుండగా చిత్రీకరించిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మొదట కుటుంబకలహాలే కారణమన్న కోణంలో కళాశాల యాజమాన్యం చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అదే నిజమని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలను పోలీసులు ఆరా తీయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను రాత్రికి రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హాజరెందుకేయలేదని ప్రశ్నించిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనపై అదే రోజు నారాయణ కళాశాలలో అనంతపురం వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి విచారణ చేపట్టారు. భవ్యశ్రీ ఉదయం 7.20 గంటలకు కళాశాలకు చేరుకున్నట్లుగా గుర్తించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కళాశాల నాల్గో అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా నిర్ధారించుకున్నారు. హాజరుకు సంబంధించి పట్టికను పరిశీలించగా అందులో అబ్సెంట్ వేసి ఉండడంపై సంబంధిత అధికారులను సీఐ రవిశంకరరెడ్డి ప్రశ్నించారు. కళాశాలకు హాజరైనా.. అబ్సెంట్ ఎందుకు వేశారంటూ ప్రిన్సిపాల్‌ను మందలించారు. విద్యార్థులను ఆరా తీసిన డీఎస్పీ : విద్యార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై డీఎస్పీ జి. ప్రసాదరెడ్డి మంగళవారం ఆరా తీశారు. భవ్యశ్రీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని పిలిచి ఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఫీజుల చెల్లింపు విషయంలో యాజమాన్యం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ డీఎస్పీ ఎదుట పలువురు విద్యార్థులు వాపోయినట్లు తెలిసింది. లెటర్ డ్రామా శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన సదాశివ, జ్యోతి దంపతులు అనంతపురం పాతూరులో నివాసం ఉండేవారు. వారి కుమార్తె భవ్యశ్రీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఉపాధి కోసం బెంగుళూరుకు వలస వెళ్తూ.. భవ్యశ్రీని నీరుగంటి వీధిలో ఉన్న అమ్మమ్మ అలివేలమ్మ వద్ద వదిలి వెళ్లారు. కళాశాల ఫీజు రూ.12 వేలు చెల్లించాల్సి ఉండగా, ఇటీవల రూ.10 వేలు కట్టారు. మరో రూ.2 వేలు పెండింగ్ ఉంది. దీనికి తోడు పరీక్ష, రికార్డు ఫీజు రూ.820 కలిపి.. మొత్తం రూ.2,820 చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన భవ్యశ్రీ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కళాశాల భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక.. ఇంటర్ విదార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నాకి వేరే కారణాలున్నాయని చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సూసైడ్ నోట్ డ్రామాకు తెరలేపారు. తన అమ్మా నాన్న విడిపోయారని, వారిని ఎవరూ కలపలేరని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థి లేఖ రాసి మరీ దూకినట్లు ప్రచారం జరిగింది. విద్యార్థిని సూసైడ్ నోట్ రాసిందని అనంతపురం వన్‌టౌన్ సీఐ రవిశంకర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ఆ లేఖను సీజ్ చేశామని, తల్లిదండ్రులకు చూపించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ తాను లేఖ రాయలేదని విద్యార్థి సంఘాల నాయకులతో బాధిత విద్యార్థిని చెప్పినట్లు తెలిసింది. -
తిమ్మమ్మ కథ
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. భవ్యశ్రీ ప్రధాన పాత్రలో బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెదరాసు సుబ్రమణ్యం నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘మర్రి మాను చరిత్రను ప్రేక్షకులకు చూపించాలనే సంకల్పంతో ఈ చిత్రం తీశాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్. -
కుత్బుల్లాపూర్‌లో రెండు డెంగ్యూ కేసులు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): కుత్బుల్లాపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. షాపూర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చింతల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన భవ్యశ్రీ, గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన ప్రేరణ అనే బాలికలు చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రిలో చేరారు. వారిద్దరికీ డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఆకతాయిల వేధింపులకు విద్యార్థిని బలి
దోమకొండ: ఆకతాయిల వేధింపులకు ఇంటర్మీడియెట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేటకి చెందిన మంగళపల్లి భవ్యశ్రీ(18) కామారెడ్డిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లేది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా ఇంటర్ చదువుతూ కామారెడ్డి వెళుతున్నారు. వీరు ప్రతిరోజు భవ్యశ్రీని వేధించేవారు. గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు మృతురాలి ఇంటి సమీపంలోకి వచ్చారు. దీంతో భవ్యశ్రీ సోదరుడు భరత్‌కు వారికి మధ్య గొడవ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం పరువు పోతోందని భవ్యశ్రీ మనస్థానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. తమ కూతురు మృతికి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే కారణమని మృతురాలి తల్లితండ్రులు గోవర్ధన్, మాధవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రినిటీ కాలేజీలో40 మందికి అస్వస్థత కరీంనగర్: కరీంనగర్‌లోని ట్రినిటీ జూనియర్ కళాశాల (ఏసీ క్యాంపస్)లో శుక్రవారం బాలల దినోత్సవరం సందర్భంగా 40 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వేడుకల్లో కేక్‌కట్ చేసినప్పుడు కొంతమంది పెప్పర్ స్ప్రే వాడినట్లు పేర్కొంటున్నారు. కళాశాల ల్యాబ్‌లో గురువారం సాయంత్రం వరకు విద్యార్థులు ప్రయోగాలు చేశారని... అక్కడ వాడిన పరికరాలు, రసాయనాలు తొలగించకుండా ఉన్నాయని, రసాయన పదార్థాలు వినియోగించిన ప్లాస్కు కిందపడి పగలడంతో ఒక్కసారిగా పొగవచ్చి విషవాయువు ప్రబలిందని మరికొందరు అంటున్నారు. యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యం గా ఉంచింది. అస్వస్థతకు గురైన వారిని నగరంలోని అపోలోరీచ్, సన్‌రైజ్ ఆస్పత్రుల్లో చేర్పిం చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘా ల నాయకులు కళాశాల క్యాంపస్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని అపోలోరీచ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ బాబురావు తెలిపారు. -
భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది?
-
భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది?
హైదరాబాద్‌కు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యమైందని ఆందోళన చెందారు. కిడ్నాప్ చేశారమో అని భయపడ్డారు. మూడు రోజుల పాటు ఒకటే గందరగోళం. ఆమె కోసం పోలీసు బృందాలు వేట. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో మీడియా కూడా తగిన స్థాయిలో స్పందించింది. చివరికి అంతా ఉత్తిదే అని తేలి పోయింది. మీస్సూ కాదు, కిడ్నాప్ అంతకంటే కాదు. భవ్యశ్రీ తనంతట తనే వెళ్లిపోయినట్లు చెప్పారు. అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు, మరో వైపు మీడియా, ఒకో వైపు ప్రజలు ఉత్కంఠగా భవ్యశ్రీకి ఏమైందోనని ఆందోళన చెందుతున్న సమయంలో ఒత్తిడి భరించలేక, కాస్త రిలీఫ్ కోసం విశాఖ వెళ్లినట్లు ఆమె చల్లగా చెప్పారు. ఆఫీసుకంటూ బయల్దేరి కనిపించకుండాపోయిన భవ్యశ్రీని పోలీసులు క్షేమంగా తీసుకువచ్చారు. ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవ్యశ్రీ క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.సంతోషం. ఇంతకూ భవ్యశ్రీ ఎక్కడికి వెళ్లింది? పోలీసులు ఆమెను ఎక్కడ పట్టుకున్నారు? ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన భవ్యశ్రీ వైజాగ్ ఎందుకు వెళ్లారు? మూడు రోజుల పాటు మీడియా కోడై కూస్తుంటే ఆమె స్పందించకపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. విజయవాడకు చెందిన మధు, హరిచందనల కుమార్తె భవ్యశ్రీ చరిత హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మరో సాప్ట్వేర్ ఇంజినీర్ కార్తికేయ చైతన్యను ప్రేమవివాహం చేసుకుంది. చైతన్య- భవ్యశ్రీ దంపతులు కేపీహెచ్‌బీ కాలనీలోనివాసం ఉంటున్నారు. ఈ నెల 9 గురువారం ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్తున్నానంటూ భవ్యశ్రీ ఇంట్లో చెప్పి బయల్దేరింది. కంపెనీ క్యాబ్ రాలేదని, ప్రైవేట్ క్యాబ్‌లో వెళ్తున్నానని భర్త చైతన్యకు మెసేజ్ పంపింది. గంట తరువాత ఆఫీసుకు చేరుకున్నావా? అని చైతన్య భవ్యశ్రీకి మెసేజ్ చేస్తే ఆమె నుంచి రిప్లై రాలేదు. గురువారం రాత్రి 7 గంటలకు డ్యూటీ ముగించుకొని చైతన్య ఇంటికి వచ్చాడు. అప్పటికీ భవ్యశ్రీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విఛాఫ్ అని రావడంతో భవ్యశ్రీ పనిచేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లి వాకబు చేశాడు. ఆమె అసలు ఆఫీసుకే రాలేదని కంపెనీ ఉద్యోగులు తెలిపారు. ఆ సమాధానం విని చైతన్య నివ్వెర పోయాడు. బంధువులు, స్నేహితులను ఆరా తీసినా లాభం లేకపోవడంతో అదే రోజు రాత్రి కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చైతన్య ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు రంగంలోకి దిగారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి భవ్యశ్రీ కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్‌లో భవ్యశ్రీ ప్రయాణించిన మార్గంలో సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం చేశారు. భవ్యశ్రీ చివరిసారిగా క్యాబ్‌లో ఉన్నాను అంటూ భర్తకు మెసేజ్ చేసింది. ఆ తరువాత 30 నిమిషాలకే ఆమె ఫోన్ స్విఛాఫ్ అయింది. శుక్రవారం సాయంత్రం ఆమె ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇక్కడ భవ్యశ్రీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కేసును గందరగోళంగా మార్చేశాయి. ప్రైవేటు క్యాబ్‌లో వెళ్తున్నానని భవ్యశ్రీ భర్త చైతన్యకు మెసేజ్ చేసింది. ఐతే భవ్యశ్రీ క్యాబ్‌లో వెళ్లలేదని, షేరింగ్ ఆటోలో వెళ్లిందని భవ్యశ్రీ తల్లిదండ్రులు పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల గాలింపు తర్వాత పోలీసుల ప్రయత్నం ఫలించింది. హైదరాబాద్‌లో మాయమైన భవ్యశ్రీ వైజాగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భవ్యశ్రీ విశాఖ జిల్లా పాడేరు గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే అక్కడ పోలీసులకు భవ్యశ్రీ చిక్కినట్లే చిక్కి మాయమైంది. గదిలో టీవీ పనిచేస్తూనే ఉన్నా భవ్యశ్రీ మాత్రం కనిపించలేదు. మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమై భవ్యశ్రీ అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లినట్లు పసి గట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు ఆమెను పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చి ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకే తాను విశాఖకు వెళ్లానని, అంతేతప్ప భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవని భవ్యశ్రీ చెప్పారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలను అనవసరంగా రచ్చకెక్కించారని మీడియాపైనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, భవ్యశ్రీకి మధ్య ఎలాంటి వివాదాలు లేవని భర్త కార్తీకేయ చైతన్య చెప్పారు. తన భార్య క్షేమంగా ఇంటికి చేరుకున్నందున ఇంతటితో ఈ కేసును వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. భవ్యశ్రీ విశాఖ ఎందుకు వెళ్లిందనే ప్రశ్నకు పోలీసులు సమాధానం దాటవేశారు. భవ్యశ్రీ ఎందుకు వెళ్లిపోయిందో తనకు కూడా తెలీదని భర్త చెప్పారు. మీడియాలో ఒక రోజంతా తన గురించి గందరగోళం చోటుచేసుకున్నా, తన ఆచూకీని భవ్యశ్రీ చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే భవ్యశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు. **