అనంతపురం అగ్రికల్చర్ : డ్రిప్, స్ప్రింక్లర్లు పొందిన రైతుల నుంచి ఆధార్ సేకరించాలని, ఈ కార్యక్రమం 5వ తేదీలోగా పూర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. ఉద్యానశాఖ ఏడీ సీహెచ్ సత్యనారాయణ, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఎంఐఏవోలు, ఇరిగేషన్ కంపెనీ డీసీవోలు, ఉద్యానశాఖ ఎంపీఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి కావడంతో పథకం ప్రారంభమైన 2003–04 ఆర్థిక సంవత్సరం నుంచి 2013–14 సంవత్సరం వరకు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందిన రైతుల నుంచి వివరాలు సేకరించాలన్నారు. 2014–15 నుంచి ఆధార్ తీసుకున్నామన్నారు. అంతకు మునుపుకు సంబంధించి కూడా ఇప్పటికే 50 శాతానికి పైగా ఆధార్ సేకరించామని తెలిపారు. వంద శాతం సేకరించాలని ఆదేశాలు ఉండటంతో వచ్చే ఐదు రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తీ చేయాలని ఆదేశించారు.
ఇక మీ–సేవాలో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి ప్రాథమిక పరిశీలన చేపట్టాలన్నారు. రైతుల నుంచి డీడీలు కట్టించుకున్న వారం రోజుల్లోపు కార్యాలయంలో ఇవ్వని కంపెనీలకు అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు 7 వేల హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు ఇచ్చామన్నారు.
ఐదు రోజుల్లో ఆధార్ పూర్తి కావాలి
Published Fri, Sep 30 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement