జిల్లాలో 38 కరువు మండలాలు | 38 drought mandals in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో 38 కరువు మండలాలు

Published Sat, Oct 8 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

38 drought mandals in district

– ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ నివేదిక
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌.. ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ సంస్థకు నివేదిక పంపారు. వర్షాలు అతి తక్కువగా పడటం, సాగు 50శాతం కంటే తక్కువ ఉండటం, వర్షానికి, వర్షానికి ఉన్న వ్యవధిని బట్టి 38 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు.  ప్రభుత్వం ఇటీవల కరువు ప్రాంతాలను ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపాలని మార్గదర్శకాలు పంపింది. ఈ నెల7వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగన్ని ఆదేశించింది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో  సాధరణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే 50 శాతం కంటే తక్కువ సాగైన మండలాలు మూడు ఉన్నాయి. వరుసగా 28 రోజుల పాటు వర్షాలు పడని మండలాలు 26 ఉన్నాయి.   
 
కరువు ప్రాంతాలుగా ప్రతిపాదించిన మండలాలు ఇవే...
పెద్దకడుబూరు, హొళగొంద, ఆలూరు, శిరివెళ్ల, రుద్రవరం, దొర్నిపాడు, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు,  కల్లూరు, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యలవాడ, గోస్పాడు, కోవెలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement