Kondamallepalli
-
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కొండమల్లేపల్లి : నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివా రం కొండమల్లేపల్లిలో రూ. 10లక్షలతో నిర్మిస్తు న్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మండల పరిధిలోని దోనియాలలో రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడు తూ టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్టీ అభివృద్ధి నిధుల నుంచి అన్ని తండాలకు బీటీ రోడ్ల నిర్మా ణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కేసాని లింగారెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్ అందుగుల ముత్యాలు, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, వస్కుల కాశయ్య, ఎలిమినేటి సాయి, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్, కుంభం శ్రీనివా స్‌గౌడ్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ అప్ గ్రేడ్‌పై హర్షం దేవరకొండ : దేవరకొండను నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంలో కృషి చేసినందు కు నగరపంచాయతీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటిగా అప్‌గ్రేడ్ కా వడంపై హర్షం వ్యక్తం చేస్తూ దేవరకొండ అభివృద్ధికి దోహదపడుతుం దని అన్నారు. వైస్ చైర్మన్ జాన్‌యాదవ్ ఎమ్మెల్యేకు శా లువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కౌన్సి లర్లు వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, పొట్ట సుగుణయ్య, రాజినేని వెంకటేశ్వర్రావు, నాగవరం ప్రభాకర్‌రావు, రమావత్ దస్రూ నాయక్, పస్నూరి వెంకటేశ్వరెడ్డి, ఉప్ప ల శ్రీను, మాడ్గుల యాదగిరి, రాజు, కృష్ణ, మధు, ఇద్దయ్య, మునిందర్‌రెడ్డి, సుబ్బారావు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
కొండమల్లేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి కొండమల్లేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. పీఏపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామపంచాయతీకి చెందిన రమావత్ రాములు తన బంధువులతో కలిసి బైక్‌పై కొండమల్లేపల్లి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వా హనం ఢీకొట్టింది. రాములుకు తీవ్ర గాయాలు కావడంతో దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. -
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
కొండమల్లేపల్లి : దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన గిరిజన ప్రాంతమైన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాగా ప్రకటించకుంటే నేటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నేనావత్ వశ్యానాయక్, గాజుల మురళి, గాజుల రాజేష్, యాదయ్య, కృష్ణయ్య, అమరేందర్‌రెడ్డి, ఇమ్రాన్, నీలా రవికుమార్, ఇలియాస్, యాదగిరి, శివ, కొండల్, లక్ష్మికాంత్, మోతీలాల్, తౌఫిక్, రాందాస్, నాగార్జున, జావెద్ పాల్గొన్నారు. -
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
కొండమల్లేపల్లి : దేవరకొండ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక నేపథ్యం కలిగిన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే హైపవర్ కమిటీని కలిసి నివేదించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, చందంపేట, డిండి, కొండమల్లేపల్లి, నేరడుగొమ్ము, అచ్చంపేటలోని సిద్ధాపురం, కల్వకుర్తిలోని వంగూరు, చారగొండ, సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోయే క్రమంలో దేవరకొండకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మట్టిపల్లి వెంకటయ్య, నల్లగాసు జాన్‌యాదవ్, శిరందాసు కృష్ణయ్య, చీదెళ్ల గోపి, సుభాష్‌గౌడ్, రేణుగౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కొండమల్లేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణ శివారులోని నల్లగొండ రోడ్డులో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధి గౌరికుంటతండాకు చెందిన ఇంద్రావత్ కళ్యాణ్ (17) పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కళ్యాణ్ తన సోదరుడితో కలిసి రాత్రి తండా నుంచి కొండమల్లేపల్లి పట్టణానికి నడుచుకుంటూ కాలినడకన వస్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కళ్యాణ్ తలకు తీవ్రగాయాలు కాగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సర్దార్ తెలిపారు. -
మెటిల్డా పాఠశాలలో డిప్యూటీ ఈఓ విచారణ
కొండమల్లేపల్లి : పట్టణంలోని మెటిల్డా పాఠశాలలో విద్యార్థి మహేష్ గాయమైన ఘటనపై సోమవారం దేవరకొండ డిప్యూటీ ఈఓ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయురాలిని విచారించి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ పూర్తయ్యే వరకు పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పాఠశాలల బంద్‌కు పిలుపు... ఇదిలాఉండగా విద్యార్థి మహేశ్‌కు న్యాయం చేయడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం పట్ణణంలోని పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్వీ, ఎన్ఎస్యూఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, టీఎన్ఎస్ఎఫ్ సంఘాల నాయకులు కొర్ర రాంసింగ్, వేముల రాజు, ముదిగొండ మురళీకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, వంగూరి వెంకటేశ్వర్లు, సిరాజ్, సురేష్, ఇలియాస్, లక్ష్మణ్‌నాయక్, పానుగంటి శ్రీకాంత్, రజినీకాంత్, దర్శనం విష్ణు, శివ, రమేష్ పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయం
కొండమల్లేపల్లి : పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే మదర్ డెయిరీ ధ్యేయమని నార్మాక్స్ మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో జాతీయ పాడి ప్రణాళిక –1 లో భాగంగా ఎస్సీ, ఎస్టీ పాల ఉత్పత్తిదారులకు నిర్వహించిన పాడి పరిశ్రమపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నార్మాక్స్ యూనియన్ ద్వారా అందించే సాంకేతిక వనరులు, మార్కెటింగ్ వ్యవస్థ వంటి వాటిని వివరించారు. అనంతరం 2014–15 సంవత్సరంలో పదోతరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు, ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం పాల సంఘాల ఆధ్వర్యంలో చైర్మన్ జితేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జలందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వెంకట్‌రెడ్డి, ఎం.డి. రమేష్, డీజీఎం అశోక్, మేనేజర్ కృష్ణ, రమేష్, చంద్రమోహన్, ప్రభాకర్, ముత్తాని రవీందర్‌రెడ్డి, నగేష్, పాల సంఘాల డైరెక్టర్లు, పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. -
బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా
కొండమల్లేపల్లి (చింతకుంట్ల) చింతకుంట్ల గ్రామానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన విద్యార్థులు శనివారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బస్సు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గతంలో గ్రామానికి ఉన్న ప్రత్యేక బస్సును పునరుద్ధరించాలని కోరారు. సమయానుకూలంగా బస్సును నడపకపోవడంతో కొండమల్లేపల్లికి విద్యాభ్యాసం కోసం వెళ్లే సుమారు 150 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో అప్పటికప్పుడే డిపో మేనేజర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం చింతకుంట్లలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ శవ్వ యాదమ్మవెంకటయ్య, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, ఎక్సైజ్ సీఐ జిలానీ, ఎస్ఐ పరమేశ్వర్‌గౌడ్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య
నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నేనావత్ కమ్లి(40) అనే మహిళా రైతు అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది.