మెటిల్డా పాఠశాలలో డిప్యూటీ ఈఓ విచారణ
మెటిల్డా పాఠశాలలో డిప్యూటీ ఈఓ విచారణ
Published Mon, Sep 19 2016 11:36 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
కొండమల్లేపల్లి : పట్టణంలోని మెటిల్డా పాఠశాలలో విద్యార్థి మహేష్ గాయమైన ఘటనపై సోమవారం దేవరకొండ డిప్యూటీ ఈఓ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయురాలిని విచారించి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ పూర్తయ్యే వరకు పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
పాఠశాలల బంద్‌కు పిలుపు...
ఇదిలాఉండగా విద్యార్థి మహేశ్‌కు న్యాయం చేయడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం పట్ణణంలోని పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టీఆర్‌ఎస్వీ, ఎన్‌ఎస్‌యూఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, టీఎన్‌ఎస్‌ఎఫ్ సంఘాల నాయకులు కొర్ర రాంసింగ్, వేముల రాజు, ముదిగొండ మురళీకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, వంగూరి వెంకటేశ్వర్లు, సిరాజ్, సురేష్, ఇలియాస్, లక్ష్మణ్‌నాయక్, పానుగంటి శ్రీకాంత్, రజినీకాంత్, దర్శనం విష్ణు, శివ, రమేష్ పాల్గొన్నారు.
Advertisement