Deputy EO
-
దివ్యాంగుల పట్ల చిన్నచూపు తగదు
కమలాపురం: దివ్యాంగుల పట్ల చిన్నచూపు తగదని డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దివ్యాంగులు వినియోగించుకోవాలన్నారు. ఎంఈఓ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ భవిత కేంద్ర సేవలు వివరించారు. కార్యక్రమంలో ఐఈఆర్టీలు బలరామిరెడ్డి, మహేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
డిప్యూటీఈవోల బాధ్యతలు ఇక డీఈవోలకే!
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీఈవో)లు నిర్వహించిన బాధ్యతలను ఇకపై డీఈవోలే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటివరకు డిప్యూటీఈవోలుగా ఉన్న వారంతా ఇన్‌ఛార్జి డీఈవోలు అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో పోస్టులను విద్యాశాఖ భర్తీ చేయడం ఆపేసింది. దీంతో డిప్యూటీఈవోలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించేవారు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీఈవోల బాధ్యతలను ఇకపై డీఈవోలే చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు కొత్త మండలాల్లో ఎంఈవోల బాధ్యతలు కూడా వాటి పరిసర మండలాలకు (పాత మండలాలకు) చెందిన ఎంఈవోలకు అప్పగించాలని డీఈవోలను ఆదేశించినట్లు సమాచారం. -
మెటిల్డా పాఠశాలలో డిప్యూటీ ఈఓ విచారణ
కొండమల్లేపల్లి : పట్టణంలోని మెటిల్డా పాఠశాలలో విద్యార్థి మహేష్ గాయమైన ఘటనపై సోమవారం దేవరకొండ డిప్యూటీ ఈఓ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయురాలిని విచారించి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణ పూర్తయ్యే వరకు పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పాఠశాలల బంద్‌కు పిలుపు... ఇదిలాఉండగా విద్యార్థి మహేశ్‌కు న్యాయం చేయడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం పట్ణణంలోని పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీఆర్ఎస్వీ, ఎన్ఎస్యూఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, టీఎన్ఎస్ఎఫ్ సంఘాల నాయకులు కొర్ర రాంసింగ్, వేముల రాజు, ముదిగొండ మురళీకృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, వంగూరి వెంకటేశ్వర్లు, సిరాజ్, సురేష్, ఇలియాస్, లక్ష్మణ్‌నాయక్, పానుగంటి శ్రీకాంత్, రజినీకాంత్, దర్శనం విష్ణు, శివ, రమేష్ పాల్గొన్నారు. -
ఉపవిద్యాశాఖాధికారి పోస్టుకు పోటాపోటీ
నాకే ఇవ్వాలంటున్న విద్యాశాఖ ఏడీ బోధనేతరులకు ఇవ్వొద్దంటున్న గెజిటెడ్ హెడ్మాస్టర్లు కలెక్టర్ వద్దకు చేరిన పంచాయతీ ఖమ్మం : ఖమ్మం ఉప విద్యాశాఖాధికారి పోస్టుకు పోటాపోటీగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పోస్టు తనకే ఇవ్వాలని విద్యాశాఖ ఏడీ నాగేశ్వరరావు పట్టుపడుతుండగా.. బోధనేతరులకు కాకుండా సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలని ఆ సంఘం నాయకులు కోరుతున్నారు. ఇప్పటివరకు విద్యాశాఖకే పరిమితమైన ఈ వివాదం బుధవారం జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. పలువురు సీనియర్ గెజిటెడ్ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమకే డిప్యూటీ ఈఓ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఖమ్మం ఉప విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆదినారాయణమూర్తి పదవీ విరమణ పొందడంతో ఆ బాధ్యతలు డైట్ కళాశాల అధ్యాపకుడు బస్వారావుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో 2013లో డిప్యూటీ ఈఓల భర్తీకోసం ప్రయత్నాలు చేసి పలువురు సీనియర్ గెజిటెడ్ ఉపాధ్యాయులను నియమించారు. అయితే వారి నియామకం సక్రమంగా లేదని ఆ నియామకాలను రద్దు చేశారు. జనవరిలో పదవీ విరమణ పొందుతున్న బస్వారావుకు ఇటీవల డైట్ కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే కళాశాల అధ్యాపకుడిగా,ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆయన ఖమ్మం ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు చేయలేనని, తనను ఈ బాధ్యతలనుంచి తప్పించాలని పలుసార్లు విజ్ఞప్తిచేశారు. ఈక్రమంలో సమాన కేడర్‌గా పనిచేస్తున్న తనకు డిప్యూటీ ఈఓకు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయని, బీఈడీ సర్టిఫికెట్ ఉందని తెలుపుతూ విద్యాశాఖ ఏడీ నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రయత్నాలు కొద్ది రోజులుగా కొనసాగుతుండగా.. రెండు, మూడు రోజులుగా ఈ ఫైల్ కలెక్టర్ కార్యాలయానికి చేరిందని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా గెజిటెడ్ ప్రధానోపాద్యాయుల సంఘం నాయకులు వీరస్వామి కలెక్టర్‌ను కలిసి డిప్యూటీ ఈఓ పోస్టును సీనియర్ గెజిటెడ్ ఉపాధ్యాయులకే ఇవ్వాలని కోరారు. ఖమ్మం అర్బన్మండలం కోయచెలక ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు నీరజ వేర్వేరుగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎటూ తేల్చుకోలేని విద్యాశాఖాధికారి.. డిప్యూటీ ఈఓ పోస్టు భర్తీకి ఏ విధమైన నిబంధనలు పాటించాలనే విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఒకవైపు కార్యాలయంలోని ఏడీ ముమ్మర ప్రయత్నాలు చేయడం.. మరోవైపు గెజిటెడ్ ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆ పోస్టులో బస్వారావునే కొనసాగిస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. అయితే ఇటీవల బస్వారావు తాను పనిచేయలేనని చేతులెత్తేయడం, ఇరువర్గాలనుంచి ముమ్మర ప్రయత్నాల నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. -
ఐటీడీఏ డిప్యూటీ ఈఓ ఆత్మహత్యాయత్నం
ఏటూరునాగారం : వ్యక్తిగత కారణాలతో ఐటీడీఏ డిప్యూటీ ఈఓ, తాళ్లగడ్డ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం పులుసం సాంబయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తాళ్లగడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న సాంబయ్య.. రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఆదివారం ఉదయం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వరంగల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, సాంబయ్య ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియరాలేదు. -
టీటీడీలో డిప్యూటీ ఈవోల బదిలీలు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో డిప్యూటీ ఈవోల బదిలీలు శనివారం జరిగాయి. బదిలీ అయిన వారిలో తిరుచానూరు డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, మార్కెటింగ్ విభాగం వేణుగోపాల్, చెన్నైలోని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మీ ఉన్నారు. తిరుమల డిప్యూటీ ఈవోగా కోదండ రామారావు నియమించబడ్డారు. -
ఆలయ డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ దాడులు
తిరుపతి (చిత్తూరు జిల్లా) : తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో టి.భూపతి ఇంటిపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
బంగారు వాకిలి తాళం మొరాయింపు
శ్రీవారి ఆలయంలో హైరానా - కట్‌చేసి తాళం తొలగింపు - యథావిధిగా సుప్రభాత సేవ సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. వేకువజామున సుప్రభాత వేళకు ముందు బంగారు వాకిలికి అమర్చిన తాళం మొరాయించింది. వెల్డింగ్ యంత్రంతో కట్‌చేసి తాళం తొలగించి యథావిధిగా సుప్రభాత సేవను నిర్వహించారు. గర్భాలయానికి సుమారు 70 అడుగుల ముందు బంగారు వాకిలి ఉంది. ప్రతిరోజూ రాత్రి 12.30 గంటలకు ఏకాంత సేవ ముగిసిన వెంటనే బంగారు వాకిలి ద్వారం మూసివేసి మూడు తాళాలు వేస్తారు. అందులో ఒకదానికి సీలు వేస్తారు. తాళం చెవులు జీయర్, అర్చకులు, ఆలయ పేష్కారు వద్ద ఉంటాయి. మరుసటి రోజు వేకువన 2.20 గంటలకు సుప్రభాత సేవకు ముందు తాళాలు తొలగించి సేవను నిర్వహిస్తారు. బుధవారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బృందం కూడా సుప్రభాత సేవకు హాజరైంది. దీంతో ఆలయ బంగారు వాకిలిని ఐదు నిమిషాలకు ముందే 2.15 గంటలకు తెరిచేందుకు అర్చకులు ప్రయత్నించారు. రెండు తెరుచుకున్నాయి. సీలు వేసిన తాళంలోని లివర్స్ తెగిపోవడం వల్ల అర్చకులు, అధికారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. అప్పుడే శ్రీలంక బృందంతో ఆలయంలోకి ప్రవేశించిన ఈవో సాంబశివరావుకు సమాచారం ఇచ్చారు. ఆవయన ఆదేశాలతో కట్టర్‌తో తాళాన్ని కోసి తొలగించారు. అప్పటికే 2.48 నిమిషాలైంది. తర్వాత గర్భాలయంలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.ఈ సంఘటనలో మానవ తప్పిదం లేకపోయినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ఈవో ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాప్యంలేదు : డిప్యూటీ ఈవో ‘‘సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారి మీదే ప్రమాణం చేస్తున్నా.. శ్రీవారి సుప్రభాత సేవ 3 గంటలకే ప్రారంభమైంది’’ అని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. జాప్యం జరిగిందన్నది అవాస్తవమన్నారు.