కమలాపురం: దివ్యాంగుల పట్ల చిన్నచూపు తగదని డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దివ్యాంగులు వినియోగించుకోవాలన్నారు. ఎంఈఓ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ భవిత కేంద్ర సేవలు వివరించారు. కార్యక్రమంలో ఐఈఆర్టీలు బలరామిరెడ్డి, మహేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.