తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో డిప్యూటీ ఈవోల బదిలీలు శనివారం జరిగాయి. బదిలీ అయిన వారిలో తిరుచానూరు డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, మార్కెటింగ్ విభాగం వేణుగోపాల్, చెన్నైలోని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మీ ఉన్నారు. తిరుమల డిప్యూటీ ఈవోగా కోదండ రామారావు నియమించబడ్డారు.