బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా
బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా
Published Sat, Jul 23 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
కొండమల్లేపల్లి (చింతకుంట్ల)
చింతకుంట్ల గ్రామానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన విద్యార్థులు శనివారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బస్సు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గతంలో గ్రామానికి ఉన్న ప్రత్యేక బస్సును పునరుద్ధరించాలని కోరారు. సమయానుకూలంగా బస్సును నడపకపోవడంతో కొండమల్లేపల్లికి విద్యాభ్యాసం కోసం వెళ్లే సుమారు 150 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో అప్పటికప్పుడే డిపో మేనేజర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
Advertisement
Advertisement