కోహినూర్ హిల్స్‌కు వేస్తున్న సీసీ రోడ్డు
విజయనగరం , కొత్తవలస: మండలంలోని అర్దానపాలెం ఏపీ మోడల్ స్కూల్‌కు సమీపంలో ఉన్న కోహినూర్ హిల్స్ రియల్‌ఎస్టేట్‌కు లబ్ధి చేకూరేలా నిర్మిస్తున్న సీసీ రోడ్డుతో పా టు కొత్తవలస – ఎస్.కోట రహదారిలో ప్రాంతీయ పశువుల చికిత్సాలయం సమీపంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న మదు ము పనులను వెంటనే నిలిపివేయాలని అధికా రులు ఆదేశాలు జారీ చేశారు. ‘ఎవడరూ అడగర నే కదా..’ శీర్షికన సాక్షిలో ఆదివారం ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందించారు. ఇదిలా ఉంటే కంటకాపల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎస్.కోట నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ, కోహినూర్ హిల్స్‌కు ఉపయోగపడేలా రూ. 40 లక్షలతో 500 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మిస్తున్నారన్నారు. అలాగే మరో రియల్‌ఎస్టేట్‌కు ఉపయోగపడేలా మదుము నిర్మిస్తున్నారని..ఈ పనులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కడ చేపట్టాలో ఎమ్మెల్యేకు తెలియకపోవడం శోచనీ యమన్నారు. మోడల్ స్కూల్, గిరిజన యూనివర్శిటీకి రోడ్డు నిర్మాణం పేరిట నిర్మిస్తున్న ప్రాం తంలో ఒక్క ఇల్లైనా ఉందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పెత్తందారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు.
చర్యలు తీసుకోవాలి...
గిరిజన యూనివర్శిటీకి రోడ్డు నిర్మిస్తున్నామం టూ కోహినూర్ హిల్స్‌కు రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం దుర్మార్గమని..ఎమ్మెల్యే లలితకుమారి ఈ పనులను ప్రోత్సహించడం ఆమె స్వార్థానికి ఒక ఉదాహరణని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యాక్షుడు కె.సన్యాసిపాత్రుడు అన్నా రు. వెంటనే పనులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో మెరపల సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తూర్పాటి వరలక్ష్మి, బొం తల వెంకటరావు, వై. మాధవరావు, ద్వారపూడి అర్జునరావు, వేలమూరి బాబీ, మదిన అప్పలరమణ, వెలగల వెంకటరమణ, పీఎస్‌ఎన్ పాత్రు డు, బూసాల రమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment