ఆర్మూర్: అన్నా మనోళ్లను మన పార్టీకే ఓటు వేయ మని ఫోన్ చేసి చెప్పన్నా అంటూ పలు రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు గల్ఫ్ దేశాల్లో ఉ పాధి కోసం వెళ్లిన వారికి ఫోన్లు చేసి చెబుతున్నారు. స్థానికంగా ఉన్న పరిచయాలను వినియోగించుకొని బంధు, మిత్రుల ఓట్లు తమ పార్టీకి రాబట్టుకొనే ప నిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొననుంది. ఆయా పార్టీల నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూ సు కు పోతున్నారు.
అయితే వారి గెలుపు కోసం పని చే స్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు గ్రామాల్లో నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి వివరా ల ను సేకరిస్తున్నారు. వారికి ఫోన్లు చేసి తమ పార్టీ అ భ్యర్థి విజయం సాధిస్తే వారి కుటుంబ సభ్యులకు పింఛన్ ఇప్పిస్తామని, ఇంటికి రోడ్డు వేయిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. గల్ఫ్‌లో ఉన్న వారు గ్రామాల్లో ఉన్న సమయంలో తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ వారి కుటుంబ సభ్యుల కు ఫోన్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీ ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువు రు ద్వితీయ శ్రేణి నాయకులు ఒక అడుగు ముందు కు వేసి గల్ఫ్ దేశాల్లో ఆర్మూర్ ప్రాంతీయులు ఉండే ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయా లని సంకల్పించారు.
అందులో భాగంగా ఆ యా పార్టీలకు చెందిన పలువురు నాయకులు దు బాయి కి వెళ్లనున్నారు. అక్కడ ప్రవాస భారతీయులతో స మావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు పది లక్షల మంది గ్రామీణులు గల్ఫ్ దేశా ల్లో ఉంటున్నందున వారితో చెప్పించి కు టుంబ స భ్యుల ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇందు కోసం ఆయా పార్టీల నాయకులు బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment