బీజేపీ అభ్యర్థిపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్
ఎంపీగా పదేళ్లలో చేసిందేమీ లేదని విమర్శలు
చేసిన అభివృద్ధిని వివరిస్తూ
ఓట్లడుగుతున్న బీబీ పాటిల్
సాక్షి, కామారెడ్డి: జహీరాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలకు పదును పెడుతున్నాయి. రెండుసార్లు ఎంపీగా గెలిచిన పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన కనీసం నాయకులను కూడా గుర్తు పట్టరని ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాటిల్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా, చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో సాగిపోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కాకముందే జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరా రు చేశాయి. బీజేపీనుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బరిలో దిగగా.. కాంగ్రెస్‌నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్‌ఎస్‌నుంచి వేణు గోపాల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి న బీబీ పాటిల్.. రెండుసార్లూ విజయం సాధించారు.
తొలిసారి బరిలో నిలిచినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌పై 1,44,631 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థికన్నా 6,229 ఓట్లే ఎక్కువ వచ్చాయి. అయితే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా తన మెజారిటీ తగ్గిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సంబంధాలు అంతంత మాత్రమయ్యాయి.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో పాటిల్ పార్టీ మారాలని నిర్ణయించుకుని బీజేపీ జాతీయ నాయకులను కలిసి, కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన నాటి నుంచే నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్న పాటిల్.. ఆయా ప్రాంతాల్లోని బీజేపీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ వారి సహకారాన్ని అభ్యర్థిస్తున్నారు. దీంతో కాషాయ పార్టీ నేతలంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
పార్టీకి ద్రోహం చేశాడంటున్న బీఆర్‌ఎస్..
బీబీ పాటిల్‌ను రెండుసార్లు గెలిపిస్తే ఆయన పార్టీకి ద్రోహం చేశాడని బీఆర్‌ఎస్ విరుచుకుపడుతోంది. ఎంపీ గా ప్రజలకు అందుబాటులో ఉండకుండా, నాయకులు, కార్యక ర్తలను పట్టించుకోకుండా నిర్ల క్ష్యం చేయడమే గాక స్వార్థం కోసం పార్టీ మారాడంటూ వి మర్శిస్తున్నారు. ఇటీవల జిల్లా లో పర్యటించిన మాజీ మంత్రి హ రీష్‌రావుతో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎంపీ పాటిల్‌పై ఒంటి కాలిమీద లేస్తున్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అయితే తన ఓటమికి పాటిలే కారణమంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు.
ఇదిగో అభివృద్ధి అంటున్న పాటిల్..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు విమర్శలతో దాడి చే స్తుండగా.. బీబీ పాటిల్ మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మూ డోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీబీ పాటిల్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎంపీగా తాను చేసిన అభివృద్ధి ఇది అంటూ ఓ జాబితాను రూపొందించి కరపత్రాల రూపంలో జనం ముందుంచుతున్నారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నిధుల మంజూరుతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీ ణ ప్రాంతాలకు కేంద్ర నిధులతో రహదారులు, ఇంకా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్ర భుత్వ నిధులతో చేపట్టిన పనులను వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విమర్శలపై ప్రత్యక్షంగా ఎక్కడా స్పందించకుండానే.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ, మరోసారి ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచార పర్వంలో సాగిపోతున్నారు.
ఫెయిల్యూర్ ఎంపీ అంటూ..
రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి దామో దర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు సమావేశాల్లో ఎంపీ పాటిల్‌ను టార్గెట్ చేస్తూ మా ట్లాడుతున్నారు. ‘బీబీ పాటిల్ కాదు.. బిజి నెస్ పాటిల్’ అని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment