గల్ఫ్‌హెల్ప్‌లో వినతులు స్వీకరిస్తున్న గట్టిం మాణిక్యాలరావు
సాక్షి, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు సూచించారు. బుధవారం తాడేపల్లిగూడెంలోని ప్రవాసాంధ్రుల సేవా కేంద్రంలో గల్ఫ్‌హెల్ప్ కార్యక్రమం నిర్వహించారు. ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లి గ్రామానికి చెందిన బి.పుష్పవేణి కుటుంబ అవసరాల నిమిత్తం 15 నెలల క్రితం ఒమన్ దేశం వెళ్లగా అక్కడ ఆమెకు జీతం ఇవ్వకుండా శారీరకంగా హింసిస్తున్నారని ఆమె భర్త వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురావాలని మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన డి.సీత కుటుంబ అవసరాలు నిమిత్తం ఎనిమిది నెలల క్రితం కువైట్ వెళ్లగా అక్కడ ఆమెకు జీతం ఇవ్వకుండా హింసిస్తున్నారని, సీతను స్వదేశానికి రప్పించాలని ఆమె తమ్ముడు ఎం.శ్రీనివాస్‌రావు వినతిపత్రం సమర్పించారు.
పెరవలి మండలానికి చెందిన సింహాచలం జీవనోపాధి నిమిత్తం పదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లగా ఈనెల 9న అనారోగ్యంతో మరణించారని, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరారు. వెంటనే స్పందించిన మాణిక్యాలరావు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈనెల 21న మృతదేహం స్వదేశం రప్పించడంతో పాటు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉచిత అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీ రీజినల్ మేనేజర్ వీర్రాజు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. ల్ప్‌లో వినతులు స్వీకరిస్తున్న
గట్టిం మాణిక్యాలరావు
Comments
Please login to add a commentAdd a comment