కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం
కువైట్‌లో నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కార్మికులను రోడ్డున పడేస్తున్న కంపెనీలను భారత విదేశాంగ శాఖ నిషేధించింది. ఈ కంపెనీలు కార్మికులకు పని కల్పించే పేరిట వీసాలను జారీచేసి కువైట్‌కు చేరిన తరువాత కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధమైన 92 కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కంపెనీల జాబితాను అధికారులు విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కువైట్‌లో ఉపాధి, ఉద్యోగం పొందాలనుకునేవారు తమకు వీసా జారీ చేసిన కంపెనీ విదేశాంగ శాఖ బ్లాక్‌లిస్టులో ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి ఒప్పందం ప్రకారం పని కల్పించకపోవడం, సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో కార్మికులు ఇబ్బందులు పడు తున్నారు. కువైట్ రావడానికి చేసిన అప్పులు తీరకపోవడం.. స్వదేశానికి వెళ్లినా అక్కడ ఏమి చేయాలో తెలియక కార్మికులు అక్కడే ఉండిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఖల్లివెల్లిగా (అక్రమ నివాసులు) మారుతున్నారు. కొంతమంది కార్మికులు గత ఏడాది కువైట్ ప్రభుత్వం అమలు చేసిన క్షమాభిక్షతో ఇంటికి చేరుకున్నారు. -ఎన్. చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా)
వీసాల దందా...
కార్మికులు తక్కువ మంది అవసరమైనప్పటికీ కొన్ని కంపెనీలు లెక్కలేనన్ని వీసాలను జారీచేసి కార్మికులను పెద్ద సంఖ్యలో రప్పించుకుంటున్నాయి. ఫలితంగా నైపుణ్యం ఉన్నవారికి ఆ నైపుణ్యానికి అనుగుణంగా పని లభించకపోవడం, నైపుణ్యం లేని వారికి శక్తికి మించి పని లభించడంతో గందరగోళ పరిస్థితి ఎదురవుతోంది. వీసాల దందాను అరికట్టడానికి డొల్ల కంపెనీలను గుర్తించి మన విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులు వెబ్‌సైట్‌లో జాబితా పెట్టారు. కాగా, ఈ కంపెనీలను మన దేశం నిషేధించి నప్పటికీ ఇతర దేశాల నుంచి కార్మికులు వస్తునే ఉన్నారు.
విదేశాంగ శాఖ వెల్లడించిన కంపెనీల జాబితా ఇదీ..
1. అల్ బ్లాసీమ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
2. అషీ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
3. జెర్సెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
4. అల్ వెలియా ట్రావెల్ అండ్ టూరిజం
5. అల్ అతీక్ కంపెనీ
6. అల్ అమేర్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్
7. సదా మసూద్
8.అల్ సక్‌లవీ ఇంటర్నేషనల్ కంపెనీ
9. లండన్ గ్రూప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్
10. ఆజాద్ అరేబియన్ జనరల్ ట్రేడింగ్‌అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
11.సాద్ ముత్లక్ డఖాన్ ఫర్ హోమ్ కేర్ సర్వీసెస్ కంపెనీ
12. నేషనల్ కాంట్రాక్టింగ్ కంపెనీ
13.కువైట్ ఇండస్ట్రీయల్ రిఫైనరీ మెయింటనెన్స్‌అండ్ ఇంజనీరింగ్ కంపెనీ (క్రేమెన్‌కో)
14.అల్ హజీమ్ కార్ ఎస్ట్
15.తలాల్ ఎస్‌ఎఫ్ ఆల్ అలీ క్లీనిక్
16.అల్ సబా ఫర్నీచర్
17.వతానియా ఆఫ్టికల్స్ కంపెనీ
18.ఫస్ట్ ల్యాండ్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
19.బైత్ అల్ అకావత్ జనరల్ ట్రేడింగ్
20.వరల్డ్ ఆఫ్ డిజైన్ కంపెనీ
21.ఇంటర్నేషనల్ సిటీ కార్ప్ కంపెనీ ఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్
22.మర్తయార్ అల్ అస్రార్ అల్ ఖాబందీ బిల్లింగ్‌నౌల్ స్కూల్
23.ఎలైట్ యూనివర్సల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
24.అల్ ముస్తాస్‌హార్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
25.బాబర్ నసీర్ హజీ షహరాన్ అల్ ట్రేడ్ మార్క్
26.జెంట్స్ మాస్టర్ హ్యాండ్ టైలర్స్
27.అల్ అబ్రాక్ ట్రేడింగ్ కంపెనీ
28.అల్ అబ్రాజ్ క్లీనింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
29.అల్ ఖాందక్ సెక్యూరిటీ కంపెనీ
30.జనరల్ ట్రేడింగ్ కంపెనీ(జీటీసీ)
31.కువైట్ అల్ సాకూర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్
32.అరబ్ సెంటర్ ఫర్ కమర్షియల్ అండ్‌రియల్ ఎస్టెట్ కంపెనీ
33.అహ్మద్ గౌహులమ్ రెధా అష్‌ఖానాని కోఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ డబ్ల్యూ.ఐ.ఐ
34.టీజీఎం ఇంజనీరింగ్ కంపెనీ
35.అల్ మిషైల్ సెంటర్ ఫర్ క్లోక్స్
36.జౌహారా డోరైన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో.
37.గల్ఫ్ కార్ రెంటల్ కంపెనీ
38.అల్ మసా సెంటర్ లాండ్రీ కో.
39.సఫేర్ అల్ నిదా కో.
40.వాఎల్ అల్ నుసీఫ్ ట్రేడింగ్ కో.
41.బాస్కో ఇంటర్నేషనల్ కో. జనరల్ అండ్ కాంట్రాక్టింగ్
42.ఫస్ట్ కువైట్ జనరల్ ట్రేడింగ్ కో.
43.షబా ఇంటర్నేషనల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ అండ్‌కాంట్రాక్టింగ్
44.ఆక్సిజన్ హార్డ్ లైన్ కో.
45.అల్ తన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ అండ్ ఇట్స్ అసోసియేట్ మ్యాన్ టెక్ సర్వీసెస్
46.సహారాస్ అల్ రోలా జనరల్ ట్రేడింగ్ అండ్‌కాంట్రాక్టింగ్ కంపెనీ
47.అల్ అబ్రాజ్ క్లీనింగ్ కంపెనీ అండ్ సిటీస్ కాంట్రాక్టింగ్ కంపెనీ
48.అల్ ముదీర్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ
49.అఖీలా ఫుడ్‌స్టఫ్ కంపెనీ
50.అల్ లయాలీ కార్గో ట్రాన్స్‌పోర్ట్ కో.
51.బ్రోన్‌జియా ప్రాజెక్ట్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో.
52.అల్ కహాల్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఈస్ట్.
53.మషాల్ లైలుబీ వాల్ బాషూట్
54.ఖరాఫీ నేషనల్ కేఎస్‌సీ
55.ఖరాఫీ నేషనల్ కేఎస్‌సీ (మూసివేయబడినది)
56.జనరల్ ట్రేడింగ్
57.బయాన్ నేషనల్ కన్‌స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
58.అల్ బహార్ మెడికల్ సర్వీసెస్ కో.
59.తరీఖ్ కో. డబ్యూ.ఐ.ఐ
60.ఎస్‌కేఎస్ గ్రూప్ జనరల్ ట్రేడ్ అండ్ కన్‌స్ట్రక్టింగ్ కో. డబ్ల్యూ.ఐ.ఐ
61.అల్ మనార్ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ సిమెంట్
62.సబీక్ గ్లోబల్ ఫ్యాక్టరీ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్
63.అల్ తఖీబ్ ట్రేడింగ్ కో. అల్ తఖీబ్ చాక్లేట్ కో.
64.అల్ మిషల్ కో. అబయా అండ్ బీషూట్ వర్క్‌షాప్ సెంటర్
65.బిన్ హమ్జా జనరల్ ట్రేడింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కో. అల్ సబీల్ అల్ అలామియా ఫర్ ద రిపేయిర్ ఆఫ్ జ్యూవెలరీ అండ్ సిల్వర్
66.ఫహాద్ అల్ సలీమ్ సన్స్ అండ్ పార్ట్‌నర్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో.
67.యూఎన్‌ఐ సిగ్న్ అడ్వర్టైజింగ్ కో.
68.అల్ ఫూటూత ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్‌అండ్ కన్‌స్ట్రక్టింగ్ కంపెనీ
69.గాజ్‌వాన్ ట్రేడింగ్ అండ్ కన్‌స్ట్రక్టింగ్ కంపెనీ
70.ఫస్ట్ ప్రాజెక్టస్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ
71.కేర్ సర్వీసెస్ (అల్ రియా కంపెనీ ఫర్ బిల్డర్స్‌అండ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్)
72.అల్ రువాడీ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్‌కాంట్రాక్టింగ్ కంపెనీ
73.అల్ రియా కంపెనీ ఫర్ బిల్డింగ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్
74.అల ఎస్సా మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎక్యూప్‌మెంట్ కో.
75.నసర్ గోల్డెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ గ్రూప్
76.నేషనల్ రెడీమిక్స్ కాంక్రీట్ కంపెనీ
77.అల్ రకీబ్ జనరల్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్
78.రవ్‌నాక్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తయాబా కిచెన్ ఫ్రమ్ స్టీల్ ఫ్యాబ్రికేషన్
79.హమీద్ మజ్‌యాద్ అలీ అల్‌ద్వానీ
80.నెస్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీ డబ్ల్యూ.ఎల్.ఎల్
81.ఎనాస్కో జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీడబ్ల్యూ.ఎల్.ఎల్
82.క్రిస్టియల్ హౌజ్ జనరల్ ట్రేడింగ్ కో.
83.అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కంపెనీ(ఏటీసీ)
84.స్విస్ మెడికల్ సర్వీసెస్
85.అబ్దుల్లా యూసుఫ్ అల్ రాద్వాన్ జనరల్ ట్రేడింగ్‌అండ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్
86.స్పీడ్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్. కో.
87.హైతమ్ రెస్టారెంట్
88.అల్ అల్‌మియా ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెంపర్డ్ గ్లాస్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్
89.లాబ్‌స్టర్ లేక్ రెస్టారెంట్
90.సకీనా బుక్ స్టాల్ సకినా ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్ కో.
91.ఖుదాస్ అల్ అహిలియా కో. జనరల్ ట్రేడింగ్
92.అల్ అహిలా జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో.
తెలంగాణ కార్మికులకు విదేశాంగ శాఖ చేయూత
గల్ఫ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇరుక్కుపోయిన తెలంగాణ కార్మికులను భారత విదేశాంగ శాఖ ఆదుకుంది. జెఅండ్‌పి కంపెనీ సౌదీ ఆరేబియాలో భవన నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆ కంపెనీలో ఉపాధికి వెళ్లారు. అయితే, గత సంవత్సరం ఏప్రిల్ వరకు వేతనాలు చెల్లించిన కంపెనీ యజమాన్యం ఆ తరువాత నిలిపివేసింది. అంతేకాకుండా అకామ(గుర్తింపు)ను రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు అక్కడే ఉండిపోయారు. దీని కారణంగా కార్మికులు బయట పనిచేయలేకపోయారు. అలాగే స్వదేశానికి రావాలన్నా వారిని పంపించేందుకు కంపెనీ యాజ మాన్యం అంగీకరించలేదు. దీంతో కార్మికులకు సౌదీ ఆరేబియాలోని మన విదేశాంగ శాఖ అధికారులతో పాటు లేబర్‌కోర్టును ఆశ్రయించడంతో సౌదీ ప్రభుత్వం స్పందించింది. లేబర్‌కోర్టు సూచన మేరకు సౌదీ ప్రభుత్వం భారత్‌కు వెళ్లే కార్మికులకు విమాన టికెట్లు సమకూర్చింది. 56 మంది తెలంగాణ కార్మికుల్లో ఇప్పటికే కొంతమంది స్వదేశానికి రాగా.. మరికొంత మంది ఈనెల 17న రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దాదాపు 8 నెలలకు సంబంధించి వేతనాలు కార్మికులకు అందాల్సి ఉంది. ఆ బకాయిలు త్వరలో కార్మికులకు అందనున్నాయి. విదేశాంగ శాఖ చొరవ చూపడం.. లేబర్‌కోర్టు సానుకూలంగా స్పందించడంతో తమకు న్యాయం జరిగిందని కార్మికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment