తమ డిమాండ్లపై స్పందించడానికి సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాలు ఖతర్‌కు మరో 48 గంటల గడువు ఇచ్చాయి. ఈ షరతులను అంగీకరించకపోతే వెలివేస్తామని ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు ఈజిప్ట్, యూఏఈ, బహ్రయిన్ దేశాలు ఖతర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నాయి. అల్‌జజీరా ఛానల్‌ను మూసివేత, టర్కీ సాయుధ దళాలను తొలగించడం, ఇరాన్‌తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్‌కాయిదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను అంగీకరించాలని కోరాయి. ఈ మేరకు ఇచ్చిన పది రోజుల గడువు సోమవారం ముగియడంతో దానిని బుధవారం దాకా పొడిగించాయి.