ఖతర్‌కు మరో 48 గంటల గడువు | further 48 hours to Qatar on Gulf demands | Sakshi
Sakshi News home page

ఖతర్‌కు మరో 48 గంటల గడువు

Published Mon, Jul 3 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

ఖతర్‌కు మరో 48 గంటల గడువు

ఖతర్‌కు మరో 48 గంటల గడువు

సౌదీ: తమ డిమాండ్లపై స్పందించడానికి సౌదీ నేతృత్వంలోని అరబ్‌ దేశాలు ఖతర్‌కు మరో 48 గంటల గడువు ఇచ్చాయి. ఈ షరతులను అంగీకరించకపోతే వెలివేస్తామని ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు ఈజిప్ట్, యూఏఈ, బహ్రయిన్‌ దేశాలు ఖతర్‌ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నాయి.

అల్‌జజీరా ఛానల్‌ను మూసివేత, టర్కీ సాయుధ దళాలను తొలగించడం, ఇరాన్‌తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్‌కాయిదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను అంగీకరించాలని కోరాయి. ఈ మేరకు ఇచ్చిన పది రోజుల గడువు సోమవారం ముగియడంతో దానిని బుధవారం దాకా పొడిగించాయి.

ఉగ్రవాదులకు సహకరిస్తుందన్న ఆరోపణలపై ఖతర్‌తో అరబ్‌ దేశాలు దౌత్య, ఆర్థిక, భౌగోళిక సంబంధాలను తెంచుకోవడం తెలిసిందే. ప్రస్తుతం అరబ్‌ దేశాల మధ్య తీవ్ర దౌత్య, ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఖతర్‌ విదేశాంగ మంత్రి మిగతా అరబ్‌ నేతలతో భేటీ కానున్నారు. ఖతర్‌ పాలకుడి విజ్ఞప్తి మేరకే గడువును పొడగిస్తున్నట్టు ఈ ఆదేశాలు ప్రకటించాయి. అయితే ఈ డిమాండ్లపై ఖతర్‌ విదేశాంగమంత్రి షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అల్‌ తనీ స్పందిస్తూ వీటిని అంగీకరించడం సాధ్యం కాదని, ఎటువంటి పర్యవసనాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆదివారం రోమ్‌లో అన్నారు. అయితే దౌత్యసంబంధాలను తెంచుకున్న దేశాలతో చర్చించేందుకు ఖతర్‌ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement