Goli soda
-
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి గోలిసోడా తయారీ.. నెలకు లక్షల్లో సంపాదన
గోలి సోడా.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపించేది.. దాహర్తిని తీర్చుకునేందుకు ఎక్కువగా గోలిసోడానే ఎంచుకునేవారు. ఎండకాలంలో దీనికి డిమాండ్ మరీనూ. బస్టాండ్లు, రోడ్డు పక్కన బండిలో… ఇలా ఎక్కడ పడితే అక్కడ గోలీసోడా కనిపించేది. కానీ కాలక్రమేనా గోలిసోడా వినియోగం తగ్గింది. ఎక్కడైనా చుద్దామన్నా సరిగా కనిపించడం లేదు. తాజాగా ఓ యువకుడు గోలిసోడా అమ్మేందుకు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉ ఉద్యోగాన్ని వదిలేశాడు. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం.. అసలు వార్తలోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన తుల రంగనాథ్‌కు ఐటీ సెక్టార్లో ఉద్యోగం. మంచి జీతం. కానీ అవేవి అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఏ వ్యాపారం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో దాదాపు 20 ఏళ్ల కిత్రం తను చిన్న తనంలో కరీంనగర్లో గోలిసోడా తయారు చేసే వ్యక్తులను చూసినట్లు అతనికి గుర్తొచ్చింది. తమ ప్రాంతంలో ప్రస్తుతం గోలిసోడాను తయారు చేసేందుకు ఎవరూ ఆస్తి చూపడం లేదని తెలుసుకున్నాడు. దీంతో తను పుట్టి పెరిగిన ప్రాంతంలో గోలిసోడాను తయారు చేసే బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముందే అనుకుందే తడవుగా గోలిసోడా అమ్మేందుకు సిద్ధపపడ్డాడు. ముందుగా తన బిజినెస్ ఐడియాను తల్లిదండ్రులకు వివరించగా వారు అంగీకరించలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి తల్లిదండ్రులను ఒప్పించాడు. చదవండి: ఆర్డినెన్స్ వివాదం.. ఆప్‌కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్? ఇక ఈ పని చేయడం అంత సులువు కాదని తెలుసు. దీని గురించి పలువురి దగ్గర పూర్తి తెలుసుకున్నాడు. గోలిసోడా ఆలోచన తట్టిన సమయంలో రంగనాథ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఒకవేళ ఈ వ్యాపారంలో ఫెయిల్ అయితే పెళ్లి సంబంధాలు కూడా రావని అతనికి తెలుసు అయినా తనమీద తనకున్న నమ్మకంతో 2020లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రూ. 30 లక్షలు పెట్టుబడితో గోలిసోడా కంపెనీని ప్రారంభించాడు. ఈ డబ్బును తెలిసిన వ్యక్తుల వద్ద వడ్డీ చొప్పున అప్పు చేసి మరీ తీసుకొచ్చాడు. కొంత భూమిని లీజుకు తీసుకొని అక్కడ గోలి సోడా ఫ్లాంట్‌ను నిర్మించి బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. గోలిసోడాపై అతని కృషి, అభిరుచి రంగనాథ్‌కు మంచి ఫలితాన్ని ఇచ్చింది. అది రాను రాను నాలుగు కోట్ల టర్నోవర్‌కు చేరింది. అంతేగాక దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో కాకుండా పక్క జిల్లాలలో కూడా ఈ గోలి సోడాలను బేకరీలకు, కిరాణా షాపులకు అందిస్తున్నామని నిర్వాహకుడు రంగనాత్ తెలిపారు. మొదట్లో ప్లాంటు కొంచెం ఇబ్బంది అయినా కూడా తర్వాత మెల్లమెల్లగా ప్లాంటును పెద్ద ఎత్తున విస్తరించామని రఘు అంటున్నాడు. చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ -
నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ
పిఠాపురం: ఓ సినిమాలో ‘నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ’ అనే పాట ఎంత ట్రెండ్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.. అచ్చం అలానే అనేక సంవత్సరాలు గోళీ సోడా ఒక ఊపు ఊపింది.. అది తాగితేనే గాని ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా.. పట్టేసినట్టు.. అన్నం అరగలేనట్టు.. తేన్పు రాలేనట్టు ఉన్నా ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నింటికీ సమాధానం చెప్పేది. ఇప్పుడా గోళీ సోడా ఖాళీ అయ్యింది. రోజుకో రకం సోడా మెషీన్లు అందుబాటులోకి రావడంతో గోళీ సోడాలు కనుమరుగయ్యాయి. కానీ అదే సోడా కొత్తదనంతో పునర్దర్శనమిచ్చింది. మారుతున్న వ్యాపారానికి అనుగుణంగా రంగులద్దుకుని మార్కెట్లో కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కిళ్లీ షాపుల్లో మాత్రమే కనిపించే గోళీ సోడాలు కనుమరుగు కాగా, ఇప్పుడు ప్రత్యేక వాహనాల్లో కొత్త రూపంలో దర్శనమిస్తున్నాయి. గతంలో ప్రత్యేకంగా తయారు చేసిన గాజు సీసా తయారీలోనే గోళీ ఉండేది. దానిపై రబ్బరు వాషర్ ఏర్పాటు చేసి సగం వరకూ నీళ్లు పోసి మెషీన్ ద్వారా గ్యాస్ ఎక్కించి, సోడా తయారు చేసేవారు. దీనికి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కష్టపడాల్సి వచ్చేది. మెషీన్‌పై సోడాలు తయారు చేయడం కొన్ని సమయాల్లో ప్రమాదాలకు దారి తీసేది. రాను రానూ కొత్త రకం యంత్రాలు అందుబాటులోకి రావడంతో సోడాతో పాటు డ్రింక్‌లు సైతం నిమిషాల్లో తయారవుతున్నాయి. గతంలో వచ్చిన యంత్రాలు (సోడా హబ్‌లు) సీసాలతో పని లేకుండా కేవలం గ్లాసులు మాత్రమే ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు లేకపోగా త్వరితగతిన తయారవుతుండడంతో ఎక్కువ మంది వాటిపై మొగ్గు చూపారు. దీంతో అప్పటి వరకూ అందుబాటులో ఉన్న గోళీ సోడా కనుమరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో కీచ్... మంటూ శబ్దాలు వినిపించగానే గోళీ సోడా తాగుతున్నారనుకొనేవారు. ప్రత్యేకంగా తయారు చేసిన బండ్లపై సోడాలు అమ్ముతూ అనేక మంది జీవనం సాగించేవారు. ప్రస్తుతం వారందరూ కనిపించకుండా పోయారు. వారి స్థానంలో కొత్త ట్రెండ్‌లో వచ్చిన గోళీ సోడాలు ఆటోలు, ప్రత్యేక వాహనాల ద్వారా విక్రయిస్తున్నారు. రంగోళీ సోడా ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్‌గా మారిపోతోంది. అదే విధంగా గోళీ సోడా వచ్చేసింది. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా తయారు చేసి, మార్కెట్లోకి తీసుకురావడంతో అందరూ వాటిని ఆస్వాదించడానికి ఉర్రూతలూగుతున్నారు. రండి.. బాబూ రండి.. పూర్వం పది పైసల నుంచి ప్రారంభమైన గోళీ సోడాలు రూ.1 వరకూ అమ్మకాలు జరగగా.. ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రంగుల సోడా రూ.20కి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ పలువురు ఈ సోడాలను తాగుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో ఎక్కువ మంది వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకినాడ నుంచి వస్తున్న సోడా వ్యాపారులు పలు పట్టణాల్లో ప్రత్యేక వాహనాలపై వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. కూలింగ్ పెట్టి మరీ అమ్ముతుండడంతో అందరూ వీటిని తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది
‘‘సాధారణంగా స్టార్స్ ఉన్న సినిమాలైతే ముందు వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత సినిమాకి వెళతారు. కానీ, ‘ఎవడు తక్కువ కాదు’లో స్టార్స్ లేరు. కథే స్టార్. ముందు మాట్లాడుకుని తర్వాత చూసే సినిమా కాదిది. సినిమా చూశాక దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. తమిళ ‘గోలీ సోడా’ సినిమాకి ఇది రీమేక్. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీషా సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. లగడపాటి శ్రీధర్ చెప్పిన విశేషాలు. ► టీనేజ్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తమిళంలో రూ. 2 కోట్లతో తీసిన ‘గోలీ సోడా’ సినిమా రూ. 20కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రిచ్‌గా తీశాం. ► ‘గోలీ సోడా’ చిత్రానికి హీరోయిన్ సమంత పెద్ద అభిమాని. కథ అంత బాగుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేశాం. టీనేజర్స్ నేపథ్యంలో తెలుగులో ఈ మధ్య మంచి సినిమా రాలేదు. ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది. ► యూత్‌లో ఎవడూ తక్కువ కాదు. వారికి ఎన్నో కలలు ఉంటాయి. వాటిని ఎలా సాధించొచ్చు? సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అని మా సినిమాలో చెప్పాం. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ► వేసవికి కావాల్సిన మాస్ యూత్‌ఫుల్ ఫిల్మ్. ఓవర్సీస్లో రిలీజ్‌కి ప్లాన్ చేయలేదు. ఇక్కడ స్పందనను బట్టి రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకి విక్రమ్‌కి ఎంత పేరొచ్చిందో ఈ సినిమాతో అంతకుమించి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించా.. చాలా సంతోషంగా అన్ని ఏరియాల వాళ్లు కొనుక్కోవడం బిగ్గెస్ట్ సక్సెస్. -
భలే ‘గుడ్డు’
అనంతపురం,కనగానపల్లి: సాధారణంగా కోడిగుడ్డు చిన్న పిటికెడు సైజు అయినా ఉండాలి. అయితే మండల పరిధిలోని వేపకుంటలోని రైతు దివిటి సూర్యనారాయణ ఇంటిలోని ఒక కోడి గోలీ సైజులోనే గుడ్డు పెట్టింది. తొలిరోజు సాధారణ సైజులోనే గుడ్డు పెట్టినా రెండోరోజు మాత్రం ఇలా చిన్న గుడ్డు పెట్టిందని రైతు తెలిపాడు. -
'సోడా గోలిసోడా' మూవీ స్టిల్స్
-
గోలీసోడా ఇష్టపడిన రజనీకాంత్
ఈ మధ్య తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచినవాటిలో ‘గోలీసోడా’ ఒకటి. చెన్నయ్‌లోని కోయంబేడు మార్కెట్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆ మార్కెట్లో కూలీలుగా పని చేసే నలుగురు కుర్రాళ్ల చుట్టూ ప్రధానంగా ఈ కథ సాగుతుంది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిన్న చిత్రం ప్రేక్షకాదరణతో పెద్ద సినిమా అయ్యింది. మామూలుగా ఈ తరహా చిత్రాలను రజనీకాంత్ చూస్తుంటారు. తనకు నచ్చితే, స్వయంగా దర్శక, నిర్మాతలకు, నటీనటులకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ‘గోలీసోడా’ని చూసిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారాయన. ‘‘కోయంబేడు మార్కెట్ నేపథ్యంలో అద్భుతమైన సినిమా చేశారు. చాలా ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా నలుగురు కుర్రాళ్ల నటన అద్భుతం. దర్శకుడి పని తీరు నాకు నచ్చింది. అందుకే, ఫోన్ చేసి అభినం దించాను. తన తదుపరి చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ఆ ప్రకటనలో రజనీ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అనుష్క, సమంత, మురుగదాస్ తదితర ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు. -
'గోలి సోడా'ను ఇష్టపడిన రజనీ
విమర్శకుల, ప్రేక్షకులను ఆకర్సించిన తమిళ చిత్రం 'గోలి సోడా'పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న పిల్లలతో రూపొందించిన 'గోలి సోడా' చిత్రం అద్బుతంగా ఉంది అని రజనీ వ్యాఖ్యానించారు. చెన్నైలోని కోయోంబెదు మార్కెట్ కు చెందిన నలుగురు పిల్లల కథను నేపథ్యంగా ఎస్ డీ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కోయెంబెడు మార్కెట్ లాంటి ప్రాంతంలో పిల్లలతో నిర్మించిన చిత్రం అద్బుతంగా ఉంది. నలుగురు బాల నటులు బాగా నటించారు. ఓ మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేక పోయాను అని రజనీ తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని ఆశ్వీరదించాను అని ఓ ప్రకటనలో తెలిపారు. 'గోలి సోడా' చిత్రానికి రజనీ ప్రశంసలు లభించడంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన లింగుస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని చూసి అభినందించడం మాకు గర్వంగా ఉంది. ఈ చిత్రం గురించి మాతో ఓ గంట పాటు ఫోన్ లో రజనీ మాట్లాడారు అని లింగుస్వామి తెలిపారు. జనవరి 24 తేదిన విడుదలైన 'గోలి సోడా' ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి వారంలో 8 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం గమనార్హం. -
కోయంబేడు మార్కెట్ కుర్రాళ్ల కథే గోలీసోడా
కోయంబేడు మార్కెట్లో పని చేసే కుర్రాళ్ల ఇతివృత్తమే గోలీ సోడా అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం గోలీ సోడా. ఇందులో పసంగ చిత్రం ద్వారా జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలనటులు శ్రీరామ్, కిషోర్‌తో పాటు పాండి, మురుగేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో చాందిని, సీత నటించారు. ఈ చిత్రం ఈ నెల 24న తెరపైకి రానుంది. చిత్రం గురించి దర్శకుడు విజయ్ మిల్టన్ తెలుపుతూ చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ మన దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. ఇక్కడకు నిత్యం వేలాది మంది వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్లో పని చేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు తమకంటూ ఒక గుర్తింపు కోసం చేసే ప్రయత్నమే గోలీసోడా అని తెలిపారు. చిత్రంలోని ఏడు నిమిషాల 49 సెకన్లు ఉండే ఫైట్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సుప్రియ సుందర్ కంపోజ్ చేయగా ఒక షాట్లో చిత్రీకరించినట్లు చెప్పారు. దర్శకుడు పాడిరాజా మాటలు రాశారని పేర్కొన్నారు. అరుణగిరి సంగీతాన్ని అందించారని, చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి సంస్థ తిరుపతి బ్రదర్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.