వృద్ధాప్యాన్ని(Anti-ageing) తిప్పికొట్టే ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(Bryan Johnson) కోట్లకొద్దీ డబ్బుని ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. యవ్వనంగా ఉండేలా జీవసంబంధమైన వయసును తిప్పికొట్టేందుకు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ..అత్యంత కఠినమైన డైట్‌ని అవలంభించేవాడు. ఇది ఒక రకంగా మనిషి దీర్ఘాయవుని పెంచడం ఎలా అనేదాన్ని సుగమం చేస్తుందని తరుచుగా చెప్పేవాడు బ్రయాన్.
కానీ ఈ క్రమంలో కొన్ని చికిత్సలు వికటించి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బ్రయాన్ స్వయంగా సోషల్‌మీడియాలో పేర్కొన్నారు కూడా. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ విషయాలన్ని వెల్లడించారు. తాను జీవ సంబంధ వయసును తిప్పికొట్టేలా తీసుకునే దీర్ఘాయువు(Longevity) మెడిసిన్ రాపామైసిన్(rapamycin)తో ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్ల తాను దీన్ని తీసుకోవడం ఆపేసినట్లు తెలిపారు.
నిజానికి ఆయన గత ఐదు ఏళ్లుగా యవ్వనంగా ఉండేలా దీర్ఘాయువు కోసం ఈ రాపామైసిన్‌ను 13 మిల్లీ గ్రాముల చొప్పున తీసుకుంటున్నారు. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. వైద్యులు ఈ మెడిసిన్‌ని అవయవాల మార్పిడి చేయించుకున్న రోగులకు ఇస్తారు. ఎందుకంటే శరీరం కొత్తగా మార్పిడి చేసిన అవయవాన్ని తిరస్కరించకుండా.. వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేలా ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఈ మెడిసిన్ వల్ల దీర్ఘకాలం ఉండేలా చేసే ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే అధికంగా ఉన్నాయని పరిశోధన(research)లో తేలడంతో ఈ రాపామైసిన్ మెడిసిన్‌ను ఉపయోగించడం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్ జీవితాంతం తీసుకుంటే..భారీ దుష్ప్రభావాలు తప్పవని వెల్లడవ్వడంతో తన వైద్య బృందం తక్షణమే ఆపేయాలనే నిర్థారణకు వచ్చిందని చెప్పుకొచ్చారు.
అంతేగాదు ఈ రాపామైసిన్ మెడిసిన్ వల్ల లిపిడ్ జీవక్రియను దెబ్బతీసి ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుందని బ్రయాన్ వైద్య బృందం చెబుతోంది. తద్వారా గ్లూకోజ్‌ని బాడీ యాక్సెప్ట్ చేయకపోవడం లేదా పడకపోవడం జరుగుతుందన్నారు. తన వైద్య బృందం చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ దీర్ఘాయువు పరిశోధనను అభివృద్ధి చేయడమేనని చెప్పారు.
కాగా, ఈ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టే ప్రయోగంలో భాగంగా ఇటీవలే కొన్ని నెలల క్రితం ప్లాస్మా మార్పిడి చేయించుకున్నారు. దీనికంటే ముందుకు కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్నారు. ఇలా యవ్వనంగా ఉండేందుకు రకరకాల ప్రయోగాలకు, చికిత్సలకు ఇప్పటి వరకు దాదాపు రూ.17 కోట్లు పైనే ఖర్చు పెట్టారు బ్రయాన్.
(చదవండి: నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!)
Comments
Please login to add a commentAdd a comment