
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో కీలక సమాచారం వెల్లడైంది. బాబాయ్ కృష్ణ అకౌంట్‌లో దివ్య సంపాదన లక్ష రూపాయలు డిపాజిట్ అయినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. కృష్ణ ఖాతాలో వసంత, గీతలు దఫదఫాలుగా ఈ సొమ్ము జమచేసినట్టు తేలింది. కాగా, దివ్య భర్త వీరుబాబు, బాబాయ్ కృష్ణను విశాఖ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (వైజాగ్ యువతి హత్యకేసులో రౌడీషీటర్ హస్తం! )
దివ్యను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలోనే వీరుబాబు, కృష్ణపై కేసు నమోదైంది. వీరితో కలిపి దివ్య హత్యకేసులో అరెస్టైనవారి మొత్తం సంఖ్య 8కి చేరింది. నిందితులకు వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా, 2018 డిసెంబర్‌లో వీరుబాబుతో దివ్యకు వివాహమైంది. మేనల్లుడు వీరబాబుతో దివ్యకు కృష్ణ వివాహం చేయించాడు.
(చదవండి: దివ్య చుట్టూ రక్కసి మూక!)
Comments
Please login to add a commentAdd a comment