అమెరికాలో నివసిస్తున్న దివ్య మయ్యా చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ ఇంటర్నెట్ మినీ సెలబ్రిటీగా మారింది. ‘స్కీయింగ్‌కు చీర ధరించడమే కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది భారతీయతను ప్రతిఫలించే ప్రతీక మాత్రమే’ అంటుంది దివ్య.
దివ్య వీడియోల పుణ్యమా అని ఎంతోమంది మహిళలు చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ, భారతీయతను చాటుకుంటూ ‘భేష్’ అనిపించుకున్నారు. చీరె ధరించి స్కీయింగ్ చేయడానికి సంబంధించిన సలహాలు దివ్యను అడుగుతుంటారు. తన ఛాయిస్ మాట ఎలా ఉన్నా... హెల్మెట్, గ్లోవ్స్‌లాంటి సేఫ్టీలను ధరించడం మాత్రం దివ్య మరవదు. చీర ధరించే కాదు లెహెంగా ధరించి కూడా స్కీయింగ్ చేయగలను అంటూ చేసిన వీడియో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment