skiing
-
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
వ్యర్థాల ప్లాంట్.. వినోదాల స్పాట్!
నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా? డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్‌హాగన్‌ను ప్రపంచంలోని గ్రీన్‌సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్‌గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్‌తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్‌హాగన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్హిల్గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు. 100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్‌గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్బన్ న్యూట్రల్ సిటీగా.. 2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది. రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్‌డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది. పర్వతారోహకులకు పండుగే.. పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్‌ను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్‌టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్‌ను ఓ లుక్కేసి రండి. -
దివ్యమైన ఐడియా సుమీ!
అమెరికాలో నివసిస్తున్న దివ్య మయ్యా చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ ఇంటర్నెట్ మినీ సెలబ్రిటీగా మారింది. ‘స్కీయింగ్‌కు చీర ధరించడమే కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది భారతీయతను ప్రతిఫలించే ప్రతీక మాత్రమే’ అంటుంది దివ్య. దివ్య వీడియోల పుణ్యమా అని ఎంతోమంది మహిళలు చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ, భారతీయతను చాటుకుంటూ ‘భేష్’ అనిపించుకున్నారు. చీరె ధరించి స్కీయింగ్ చేయడానికి సంబంధించిన సలహాలు దివ్యను అడుగుతుంటారు. తన ఛాయిస్ మాట ఎలా ఉన్నా... హెల్మెట్, గ్లోవ్స్‌లాంటి సేఫ్టీలను ధరించడం మాత్రం దివ్య మరవదు. చీర ధరించే కాదు లెహెంగా ధరించి కూడా స్కీయింగ్ చేయగలను అంటూ చేసిన వీడియో వైరల్ అయింది. -
జమ్మూకశ్మీర్‌లో రాహూల్ గాంధీ వేకేషన్
-
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
ఒకే ఒక్కడు త్రివర్ణంతో...
బీజింగ్: కరోనా పుట్టిన దేశం రెండేళ్ల తర్వాత కరోనా ఆంక్షల మధ్య ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. దేశంలో పలు చోట్ల ఇంకా లాక్డౌన్లు కొనసాగుతుండగానే మరోవైపు చైనా రాజధాని నగరంలో వింటర్ ఒలింపిక్స్–2022 శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్ ఘనత వహించింది. ఆరంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి హాజరు కాగా... భారత్ సహా పలు దేశాలు ‘దౌత్యపర బహిష్కరణ’ను ప్రకటించి కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. 2020లో గాల్వాన్ సరిహద్దుల్లో భారత్‌తో పోరులో గాయపడిన సైనికుడు ఖి ఫాబియోను రిలేలో టార్చ్ బేరర్‌గా పెట్టడంపై తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ భారత్ ‘డిప్లొమాటిక్ బాయ్‌కాట్’ను ప్రకటించింది. మానవ హక్కుల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ పలు ఇతర దేశాలు కూడా ప్రారంభోత్సవానికి దూరమయ్యాయి. వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్ ఖాన్ అర్హత సాధించాడు. స్కీయింగ్‌లో స్లాలొమ్, జెయింట్ స్లాలొమ్ ఈవెంట్లలో అతను పోటీ పడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ప్రారంభోత్సవ కార్య క్రమంలో భారత జాతీయ జెండాతో ముందుండగా ... భారత సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు కూడా ఆరిఫ్ వెంట నడిచారు. ఆరిఫ్ ఈవెంట్లు ఈనెల 13, 16వ తేదీల్లో ఉన్నాయి. -
అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం
మోంటెనిగ్రోలో జరిగిన అంతర్జాతీయ అల్పైన్ స్కీయింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్‌ను ఆంచల్ 1ని:54.30 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల ఆంచల్ 2018లో టర్కీలో జరిగిన టోర్నీలోనూ కాంస్యం గెలిచింది. గతంలో ఆమె నాలుగుసార్లు ప్రపంచ స్కీయింగ్ చాంపియన్‌షిప్‌లలో పోటీ పడింది. -
స్విట్జర్లాండ్ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత
స్విట్జర్లాండ్ : మంచు ప్రదేశాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో భారతీయులైతే మరి ముఖ్యంగా ఇష్టపడుతారు. ఈ విషయాన్నే కొన్ని పర్యాటక సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. మంచు ప్రదేశాల పర్యాటక జాబితాలో ముందుండే స్విట్జర్లాండ్‌కు మన భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారంటా. 59 శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో పర్యటించడానికి ఎక్కువగా స్విట్జర్లాండ్‌ను ఎంచుకోవడంలో ఆసక్తిని చూపుతున్నట్లు క్లబ్ మెడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ క్లబ్ మెడ్ సర్వే ప్రకారం సెలవుల రోజుల్లో భారతీయులు ఎక్కువ మంది స్విట్జర్లాండ్‌లో టూరిస్టులుగా ఉంటున్నారని, దాదాపు 96 శాతం భారతీయ ప్రజలు రాబోయే మూడేళ్లలో యురోపియన్ మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అధిక సంఖ్యలో భారతీయులు విహరయాత్రకు యురోపియన్ మంచు ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజంలో వైవిధ్యమైన, సాహోసోపేతమైన, ప్రయోగత్మకంగా ఉండే మంచు ప్రదేశాల వైపే పర్యటించడానికి భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ స్నో హాలిడే లీడర్, ఆసియా-పసిఫిక్ స్నో బ్రాండ్ స్టడీ 2019(ఏపీఏసీ) నివేదిక పేర్కొంది. ఆసియా-పసిఫిక్ మంచు క్రీడలను భారతీయులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. స్నో బోర్డింగ్, స్కైయింగ్ స్నో రైడింగ్లు అత్యంత ప్రజాదరణ పోందిన మంచు క్రీడలు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్-మోర్టిజ్ రోయ్ సోలైల్, ఇటలీలోని సెర్వినియా, ఫ్రాన్స్‌లోని లెస్ డ్యూక్స్‌లోని కోన్ని మంచు ప్రదేశాలు స్నో స్కైయ్ డ్రైవింగ్ పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రదేశాలకు ప్రతి ఏటా 75 శాతం భారతీయులు వస్తున్నారని, వారు కేవలం స్నో డ్రైవింగ్ కోసమే ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారని ఏపీఏసీ సర్వే వెల్లడించింది. ప్రయాణంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ప్రయాణ విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబంతో కలసి పర్యటించడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తెలింది. అన్ని వయసుల వారు సరదగా గడపడానికి, అనుగుణంగా ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. సోలోగా టూరీస్టుల కంటే 27 శాతం భారతీయులు మూడు తరాలతో కుటుంబీకులతో కలిసి పర్యాటించేందుకు ఇష్టపడే భారతీయులు 27 శాతం ఉన్నారని, ఇది ఆసియా-పసిఫీక్ సగటు 18 శాతాన్ని అధిగమించినట్లు వెల్లడైంది. -
తొలి పతకం
అంచల్‌కు ఆల్రెడీ ప్రధాని మోదీ ట్విటర్లో అభినందనలు చెప్పేశారు. క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. పూలగుత్తుల వెల్లువ ఇంకా ఆగలేదు. చరిత్ర సృష్టించిన కూతుర్ని దేశం పొగడ్తల్లో ముంచెత్తుతుంటే.. ఆమె తండ్రి రోషన్ ఠాకూర్ హృదయం ఉప్పొంగుతోంది. టర్కీ ఇంటర్నేషనల్ స్కీయింగ్‌లో అంచల్ పతకాన్ని సాధించడమే ఈ ఉల్లాసానికంతటికీ కారణం. అంచల్ మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. అదొక్కటే కాదు ఆమె ఘనత. మనదేశానికి స్కీయింగ్ విభాగంలో మెడల్ తెచ్చిన తొలి యువతి కూడా. అంచల్ ఠాకూర్ వయసు ఇరవై ఒకటి. మనాలీ (హిమాచల్ ప్రదేశ్) అమ్మాయి. తండ్రి ‘వింటర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ప్రధాన కార్యదర్శి. మన క్రీడా ప్రపంచా నికి పెద్దగా అలవాటు లేని స్కీయింగ్ క్రీడలో భారత్‌కు పతకం రావడం, అందునా ఆ ఘన తను సాధిం చింది తన కూతురు కావడంతో ఆనందాన్ని పట్టలేక పోతు న్నారు ఆయన. దేశమే మురిసి పోతుంటే తండ్రి మురిసిపోడా?! – మంజీర -
మంచు ప్రపంచం
అలాస్కా స్కీయింగ్, స్నోబోర్డింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు... జీవితంలో ఒక్కసారైనా హెలీ స్కీయింగ్ చేయాలని అనుకోకుండా ఉంటారా? ప్రత్యేక హెలికాప్టర్ గైడ్ చేస్తుండగా... 18వేల అడుగుల ఎత్తు నుంచి స్కీయింగ్ చేయటమంటే...! జీవితాన్ని మార్చేసే అనుభవమిది. డే స్కీయింగ్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమంగా భావించే అలాస్కాలో... దీని చార్జీలు ఒకరికి 1,275 డాలర్ల నుంచి మొదలవుతాయి. అలాస్కా రాష్ట్రం అమెరికాలో భాగమే అయినా... చూస్తే అదొక్కటే ఒక ప్రపంచంలా ఉంటుంది. అలాస్కాలో ఇప్పటికీ మనుషులెవరూ వెళ్లని ప్రాంతాలున్నాయి మరి. క్రూయిజ్‌లో వెళ్లినా, ఏదో ఒక కారవాన్‌ను (ఆర్వీ) అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వెళ్లినా... ఆ అనుభూతే వేరు. స్థానిక అలాస్కన్ తెగలతో పాటు ఎలుగుబంట్లు, తోడేళ్ల వంటి ‘బిగ్ ఫైవ్’ వన్య మృగాలనూ చూడొచ్చు. ఇక డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళితే అదో ప్రపంచమే. అలాస్కాలో మిస్ కాకూడనివి... * డెనాలీ నేషనల్ పార్క్ మొత్తాన్ని హెలికాప్టర్లో చుట్టే ‘ఫ్లైట్ సీయింగ్’. - ప్రిన్స్ విలియం సౌండ్ లేదా కెనాయ్ ఫోర్డ్స్‌లో గ్లేసియర్ టూర్. * యాంకరేజ్ సిటీలోని అత్యుత్తమ మ్యూజియంల సందర్శన. * మంచులో సాహసాలు, క్రీడలు. అలాస్కాను చేరుకునేదిలా? * అలాస్కాలోని డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా విమానంలో యాంకరేజ్ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. అక్కడి నుంచి డెనాలీ నేషనల్ పార్క్ దాదాపు 200 మైళ్ల దూరం. నాలుగు గంటలు పడుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి ఒకరికి రూ.1.1 నుంచి 1.2 లక్షల వరకూ విమాన ఛార్జీలుంటాయి. అక్కడ ఆర్వీని అద్దెకు తీసుకున్నా, క్రూయిజ్ ద్వారా వెళ్లినా ఛార్జీలు కాస్తంత ఎక్కువే. * దాదాపు అమెరికాకు వెళ్లే విమానాలన్నీ ఢిల్లీ, ముంబాయి మీదుగా వెళతాయి కనక అక్కడి నుంచి అమెరికాకు వెళ్లటం కాస్తంత ఈజీ. ఇక అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి యాంకరేజ్ (అలాస్కా) కు బోలెడన్ని విమానాలుంటాయి. ఇలా ఢిల్లీ నుంచి ప్లాన్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.85వేలలోపే ఉంటాయి. * వీటన్నిటికన్నా ముందు... అమెరికాకు వెళ్లాలంటే వీసా ఉండాలి. టూరిస్టులక్కూడా అమెరికా వీసా అంత తేలిగ్గా రాదు. అందుకని ఇలాంటి యాత్రల్ని బాగా ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వెళ్లొచ్చు? * జూన్ మధ్య నుంచి ఆగస్టు వరకూ టూరిస్టుల కాలం. ధరలు కూడా ఎక్కువే. * మే మధ్య నుంచి జూన్ మధ్య వరకూ కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. ఒకోసారి 25 శాతం డిస్కౌంట్ కూడా దొరుకుతుంటుంది. * ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబరు మధ్య వరకూ కూడా డిస్కౌంట్ల కాలమే. * ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్య వరకూ చలికాలం. బోలెడంత మంచు. ఐస్ స్పోర్ట్స్ కేంద్రాలన్నీ పూర్తిగా పనిచేసేది ఈ కాలంలోనే. -
పరిస్థితి కాస్త మెరుగుపడింది
గ్రెనోబ్లే (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం కుదుటపడుతుందనడానికి అవసరమైన చిన్న చిన్న సంకేతాలు షుమాకర్లో కనిపిస్తున్నాయని, అతను త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని తెలిపాయి. అయితే షుమాకర్ పరిస్థితి నిలకడగా ఉన్నా... ఇంకా క్లిష్టంగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్య బృందం స్పష్టం చేసింది. -
ఇంకా విషమంగానే షుమాకర్ పరిస్థితి
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన ఫార్ములావన్ రేసింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అతని ప్రతినిధి తెలిపారు. అయితే అతని శరీరం చికిత్సకు నిలకడగానే సహకరిస్తోందని ఆ ప్రతినిధి చెప్పారు. అక్కడి పోలీసు వర్గాలు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తును ముమ్మరం చేశాయి. స్కీయింగ్ చేస్తున్నప్పుడు ధరించిన హెల్మెట్‌లో ఉన్న కెమెరాపైనే దర్యాప్తు వర్గాలు ఆధారపడ్డాయి. కెమెరా తీసిన వీడియో, చిత్రాలతోనే ప్రమాద కోణం వెలుగు చూస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వేగంగా రాయిపై పడటంతో కెమెరా కూడా పాడైపోయిందా లేదా అనేది తేలాల్సివుంది. ప్రమాద ఘటనపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టమైన ఒక్క క్లూ కూడా దొరకలేదని తెలిసింది. కానీ ఓ ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు స్కీయింగ్ చేస్తున్నప్పుడు షుమాకర్ గంటకు 20 కి.మీ. వేగంతో వెళ్లినట్లు తెలిసింది.