తొలి పతకం | Turkey achieves the medal in international skiing | Sakshi
Sakshi News home page

తొలి పతకం

Published Wed, Jan 10 2018 11:48 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

Turkey achieves the medal in international skiing - Sakshi

అంచల్‌కు ఆల్రెడీ ప్రధాని మోదీ ట్విటర్‌లో అభినందనలు చెప్పేశారు. క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రశంసలు గుప్పిస్తున్నారు. పూలగుత్తుల వెల్లువ ఇంకా ఆగలేదు. చరిత్ర సృష్టించిన కూతుర్ని దేశం పొగడ్తల్లో ముంచెత్తుతుంటే.. ఆమె తండ్రి రోషన్‌ ఠాకూర్‌ హృదయం ఉప్పొంగుతోంది. టర్కీ ఇంటర్నేషనల్‌ స్కీయింగ్‌లో అంచల్‌ పతకాన్ని సాధించడమే ఈ ఉల్లాసానికంతటికీ కారణం. అంచల్‌ మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. అదొక్కటే కాదు ఆమె ఘనత.

మనదేశానికి స్కీయింగ్‌ విభాగంలో మెడల్‌ తెచ్చిన తొలి యువతి కూడా. అంచల్‌ ఠాకూర్‌ వయసు ఇరవై ఒకటి. మనాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌) అమ్మాయి. తండ్రి  ‘వింటర్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రధాన కార్యదర్శి. మన  క్రీడా ప్రపంచా నికి పెద్దగా అలవాటు లేని స్కీయింగ్‌ క్రీడలో భారత్‌కు పతకం రావడం, అందునా ఆ ఘన తను సాధిం చింది తన కూతురు కావడంతో ఆనందాన్ని పట్టలేక పోతు న్నారు ఆయన. దేశమే మురిసి పోతుంటే తండ్రి మురిసిపోడా?!
– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement