ఇంకా విషమంగానే షుమాకర్ పరిస్థితి | Witness says he inadvertently filmed Michael Schumacher's accident | Sakshi
Sakshi News home page

ఇంకా విషమంగానే షుమాకర్ పరిస్థితి

Published Mon, Jan 6 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Witness says he inadvertently filmed Michael Schumacher's accident

 గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన ఫార్ములావన్ రేసింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అతని ప్రతినిధి తెలిపారు. అయితే అతని శరీరం చికిత్సకు నిలకడగానే సహకరిస్తోందని ఆ ప్రతినిధి చెప్పారు. అక్కడి పోలీసు వర్గాలు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తును ముమ్మరం చేశాయి. స్కీయింగ్ చేస్తున్నప్పుడు ధరించిన హెల్మెట్‌లో ఉన్న కెమెరాపైనే దర్యాప్తు వర్గాలు ఆధారపడ్డాయి.
 
 
 కెమెరా తీసిన వీడియో, చిత్రాలతోనే ప్రమాద కోణం వెలుగు చూస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వేగంగా రాయిపై పడటంతో కెమెరా కూడా పాడైపోయిందా లేదా అనేది తేలాల్సివుంది. ప్రమాద ఘటనపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టమైన ఒక్క క్లూ కూడా దొరకలేదని తెలిసింది. కానీ ఓ ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు స్కీయింగ్ చేస్తున్నప్పుడు షుమాకర్ గంటకు 20 కి.మీ. వేగంతో వెళ్లినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement