Grenoble
-
పక్షవాతం వచ్చినా మళ్లీ నడవొచ్చు..
పారిస్: ఒక్కసారి పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు పడిపోతే.. ఇక అంతే సంగతులు. ఆ మనిషి మంచానికే పరిమితం అయిపోతారు. ఇవీ ఇప్పటివరకు పక్షవాతంపై ఉన్న ఆలోచనలు. కానీ ఇకపై ఈ లెక్క మారిపోనుంది. పక్షవాతం వచ్చినా కూడా లేచి నిలబడే అవకాశం ఉంది. ఇది ఫ్రాన్స్ వాసి విషయంలో నిజమైంది. మన మెదడు నియంత్రించేలా శరీరం బయట అస్తిపంజరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. టెలీప్లెజిక్స్ అని పిలిచే ఈ సాంకేతికతకు ఊతమిచ్చినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవనంపై నుంచి కింద పడటంతో వెన్నెముక పూర్తిగా దెబ్బతిని 28 ఏళ్ల థిబాల్ట్కు భుజం నుంచి కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది. దీంతో టెలీప్లెజిక్స్ సాంకేతికత సాయంతో అతడికి కొత్త జీవితాన్ని డాక్టర్లు ప్రసాదించారు. దీంతో తిరిగి చక్కగా నడుస్తున్నాడు. ఈ సాంకేతికతలో కంప్యూటర్ ద్వారా మెదడు నుంచి సిగ్నల్స్.. శరీరం బయట ఉన్న అస్తిపంజరాన్ని నియంత్రిస్తారు. కొన్ని నెలల పాటు ఈ అస్తిపంజరంతో శిక్షణ అందించడంతో ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. గ్రెనోబెల్ అల్పస్ ఆస్పత్రి నిపుణుల బృందం, సినాటెక్ పరిశోధకులు ఈ విజయం సంధించారు. -
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
-
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకేల్ షుమాకర్ కోమా నుంచి బయటపడ్డాడు. గ్రెనోబుల్ ఆసుపత్రి నుంచి అతడు ఇంటికి చేరుకున్నాడని షుమాకర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అతడికి వైద్యపరమైన సపర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. షుమాకర్ చికిత్స చేసిన వైద్యులు, సేవలు అందించిన నర్సులు, ప్రాథమిక చికిత్స చేసిన వారిని అతడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. షుమాకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. 45 ఏళ్ల మైకేల్ గతేడాది డిసెంబర్ 29న ఫ్రాన్సులో స్కీయింగ్ చేస్తూ పడిపోయాడు. బండరాయికి తల బలంగా మోదుకోవడంతో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. -
షుమాకర్ కోలుకోవడం కష్టమే!
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్లో గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ వేగంగా బరువు కోల్పోతున్నాడు. 83 రోజులుగా కోమాలో ఉన్న అతని బరువు 51 కేజీలకు తగ్గిపోయింది. అయితే షుమాకర్ పూర్తిగా కోలుకుంటాడని అతని కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. షుమాకర్ను కోమాలో నుంచి బయటకు తెచ్చేందుకు డాక్టర్లు నెల రోజుల నుంచి మత్తు మందులను క్రమంగా తగ్గిస్తున్నా... అతనిలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ‘ఏదైనా అద్భుతం జరిగితే తప్ప షుమాకర్ పూర్తిగా కోలుకోవడం కష్టం. ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చినా మాట్లాడేందుకు, శరీర భాగాలు కదిలించేందుకు చాలా సమయం పడుతుంది. ఇంటెన్సివ్ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది’ అని వైద్య వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబర్ 29న స్కీయింగ్ చేస్తూ గాయపడిన షుమాకర్ను గ్రెనోబుల్ ఆసుపత్రికి తరలించిన వెంటనే మెదడుకు రెండు శస్త్రచికిత్సలు చేశారు. ఇక అప్పట్నించీ కోమాలో ఉన్న అతని పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. -
ఇంకా విషమంగానే షుమాకర్ పరిస్థితి
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన ఫార్ములావన్ రేసింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అతని ప్రతినిధి తెలిపారు. అయితే అతని శరీరం చికిత్సకు నిలకడగానే సహకరిస్తోందని ఆ ప్రతినిధి చెప్పారు. అక్కడి పోలీసు వర్గాలు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తును ముమ్మరం చేశాయి. స్కీయింగ్ చేస్తున్నప్పుడు ధరించిన హెల్మెట్లో ఉన్న కెమెరాపైనే దర్యాప్తు వర్గాలు ఆధారపడ్డాయి. కెమెరా తీసిన వీడియో, చిత్రాలతోనే ప్రమాద కోణం వెలుగు చూస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వేగంగా రాయిపై పడటంతో కెమెరా కూడా పాడైపోయిందా లేదా అనేది తేలాల్సివుంది. ప్రమాద ఘటనపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టమైన ఒక్క క్లూ కూడా దొరకలేదని తెలిసింది. కానీ ఓ ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు స్కీయింగ్ చేస్తున్నప్పుడు షుమాకర్ గంటకు 20 కి.మీ. వేగంతో వెళ్లినట్లు తెలిసింది.