షుమాకర్ కోలుకోవడం కష్టమే! | F1 legend Michael Schumacher has lost a quarter of his body weight while in coma, says report | Sakshi
Sakshi News home page

షుమాకర్ కోలుకోవడం కష్టమే!

Published Sun, Mar 23 2014 1:28 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

షుమాకర్ కోలుకోవడం కష్టమే! - Sakshi

షుమాకర్ కోలుకోవడం కష్టమే!

గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్‌లో గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ వేగంగా బరువు కోల్పోతున్నాడు. 83 రోజులుగా కోమాలో ఉన్న అతని బరువు 51 కేజీలకు తగ్గిపోయింది. అయితే షుమాకర్ పూర్తిగా కోలుకుంటాడని అతని కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. షుమాకర్‌ను కోమాలో నుంచి బయటకు తెచ్చేందుకు డాక్టర్లు నెల రోజుల నుంచి మత్తు మందులను క్రమంగా తగ్గిస్తున్నా... అతనిలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ‘ఏదైనా అద్భుతం జరిగితే తప్ప షుమాకర్ పూర్తిగా కోలుకోవడం కష్టం.

 ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చినా మాట్లాడేందుకు, శరీర భాగాలు కదిలించేందుకు చాలా సమయం పడుతుంది. ఇంటెన్సివ్ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది’ అని వైద్య వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబర్ 29న స్కీయింగ్ చేస్తూ గాయపడిన షుమాకర్‌ను గ్రెనోబుల్ ఆసుపత్రికి తరలించిన వెంటనే మెదడుకు రెండు శస్త్రచికిత్సలు చేశారు. ఇక అప్పట్నించీ కోమాలో ఉన్న అతని పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement