‘బెల్ట్‌ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’ | Divya Bhatnagar Old Chats Allege Torture By Her Husband | Sakshi
Sakshi News home page

‘ముందే తెలిస్తే ఆ దెయ్యం నుంచి కాపాడేవాడిని’

Published Thu, Dec 10 2020 8:54 PM | Last Updated on Thu, Dec 10 2020 8:56 PM

Divya Bhatnagar Old Chats Allege Torture By Her Husband - Sakshi

ముంబై: దివంగత నటి దివ్యా భట్నాగర్‌ భర్త గగన్‌ గబ్రూకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్‌ ప్రకారమే తనను నమ్మించి మోసం చేశాడంటూ దివ్య గతంలో చేసిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో సెటిల్‌ అయ్యేందుకే గగన్‌ తనను ప్రేమించినట్లు నాటకమాడాడని, పెళ్లైన తర్వాత రోజూ చిత్రహింసలు పెట్టేవాడని ఆమె తన ఫ్రెండ్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మాట మాటకి బెల్ట్‌ తీసి కొట్టేవాడు. వేళ్లు విరిచేవాడు. గగన్‌ మాత్రమే కాదు వాళ్ల కుటుంబం మొత్తం మోసగాళ్లే. నన్ను పెళ్లిచేసుకునేందుకు చేసిన కుట్రలో గగన్‌ వాళ్లమ్మ ప్రమేయం కూడా ఉంది. నాలాగే ఎంతో మందిని మోసం చేశారు. 

ఆ అమ్మాయిల వివరాలు తెలుసుకునేందుకు నేను ప్రయత్నించా. ప్రతీ పనిని పక్కాగా చేయడం వాళ్లకు అలవాటు. అందుకే నాకు మొదట అనుమానం రాలేదు’’అంటూ భర్త, అతడి కుటుంబం తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి దివ్య చాట్‌లో ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దివ్య సోదరుడు దేవాశిష్‌ భట్నాగర్‌ ఆమె(దివ్య) ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారా షేర్‌ చేశాడు. తనకు ముందే తెలిసి ఉంటే ఆ దెయ్యం నుంచి దివ్యను కాపాడుకునే వాడినంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా వారిని ఎదిరించి మరీ దివ్య ఏడాది క్రితం గగన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇటీవల కరోనా బారిన పడిన దివ్యను గగన్‌ పట్టించుకోకపోవడం వల్లే ఆమె అర్ధాంతరంగా తనువు చాలించిందని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా  ‘యే రిష్తా క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్‌ గయి తో పియా మోరే’ వంటి హిందీ సిరీయల్స్‌లో దివ్య నటించారు.(చదవండి: ప్రేమ పెళ్లి: దారుణంగా హింసించేవాడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement