
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితురాలు ఏ1 గూటాల వసంత, ఏ2 వసంత సోదరి మంజు ఎలియాస్ సంధ్య, ఏ3 వసంత తల్లి ధనలక్ష్మ, ఏ4 వసంత మరిది సంజయ్, ఏ5 గీత ఎలియాస్ కుమారి, ఏ6 దివ్య పిన్ని కాంతవేణిలు ఉన్నారు. అనంతరం వీరిని వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరీక్షలు ముగిసిన తరువాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నిందితులపై ఐపీసీ 302 ,343, 324,326 సెక్షలతో పాటు మహిళల అక్రమ రవాణాచట్టం 201, 294 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 15 మందిని ఎగ్జామిన్ చేశారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు)
Comments
Please login to add a commentAdd a comment