
టెలివిజన్ నటి, మోడల్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విజేత దివ్య అగర్వాల్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ప్రియుడు వరుణ్ సూద్‌తో 4 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేస్తూ ఆదివారం ఎమోషనల్ పోస్టు పెట్టింది.
‘జీవితం సర్కస్ లాంటిది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దు. అదే నిజం. సెల్ఫ్ లవ్ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏమి జరుగుతుంది ? నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరినీ నిందించను. అదే మంచిది. నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాడానికి సమయం వెచ్చించాలనుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటిస్తున్నాను.
చదవండి: ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్‌డేట్
ఒక నిర్ణయం తీసుకోడానికి పెద్ద పెద్ద కారణాలు, సాకులు అవసరం లేదు. దీని నుంచి బయటపడటానికి ఇది నేను తీసుకున్న నిర్ణయమే. తనతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే. అతను గొప్ప వ్యక్తి. తనెప్పుడూ నాకు మంచి స్నేహితుడే. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.’ అంటూ ప్రియుడు వరుణ్‌తో బ్రేకప్ గురించి రాసుకొచ్చింది.
కాగా టెలివిజన్ సిరీస్ ఏస్ ఆఫ్ స్పేస్‌లో పాల్గొనడానికి ముందే వరుణ్, దివ్య స్నేహితులు. అక్కడి నుంచి వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వరుణ్ దివ్యకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి లవ్ ట్రాక్ ఆఫీషల్ అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అయితే ఇలా అనుకోకుండా వరుణ్, దివ్య విడిపోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
చదవండి: చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Comments
Please login to add a commentAdd a comment