
అనిరుథ్ కస్తూరి, దివ్య
అనిరుథ్ కస్తూరి, దివ్య జంటగా మహేష్ చెంగారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సంశయం’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. మహేష్ మాట్లా డుతూ– ‘‘ప్రేమించడానికి, ప్రేమించనని చెప్పడానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువతరం ప్రేమను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న విషయాన్ని చర్చించాం. ప్రేమను కొత్త కోణంలో చూపించాం. నటీనటులంతా ఎన్‌ఆర్‌ఐలు కావడం విశేషం. అందరూ కొత్తవారే అయినప్పటికి అనుభవం ఉన్నవారిలా నటించారు. ఈ చిత్రానికి ఈ టైటిల్‌నే ఎందుకు పెట్టామనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment