టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో యంగ్ హీరో తన సినిమాలతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన తన కెరీర్‌ను ముగించారు. ఉదయ్ కిరణ్ కెరీర్‌లో 2004లో నటించిన చిత్రం 'లవ్ టుడే'. ఈ సినిమాలో ఉదయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా నటించింది. తన కెరీర్‌లో టాలీవుడ్ సినిమాతోనే సినీరంగంలో ప్రవేశించింది బాలీవుడ్ భామ.
తీవ్ర గాయాల పాలైన నటి
ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోన్న బాలీవుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న దివ్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇవీ చూసిన ఆమె అభిమానులు 'గెట్ వెల్ సూన్' అంటూ పోస్టులు పెడుతున్నారు.
దివ్య ఖోస్లా ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..' నా రాబోయే చిత్రంలో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నా ముఖంపై తీవ్రమైన గాయమైంది. కానీ షూటింగ్ మాత్రం కొనసాగాలి. నేను త్వరగా కోలుకోవడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. ' అంటూ పోస్ట్ చేశారు. జాన్ అబ్రహంతో ప్రేమ పాట చిత్రీకరించినప్పుడు భర్త భూషణ్ కుమార్ సెట్‌లో ఉన్నారని దివ్య ఖోస్లా కుమార్ చెప్పారు.
కాగా.. దివ్య ఖోస్లా తన తదుపరి చిత్రం యారియాన్ -2లో కనిపించనుంది. ఇది దివ్య ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన హిమాన్షు కోహ్లీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రానికి సీక్వెల్. మీజాన్ జాఫ్రీ, యష్ దాస్ గుప్తా ప్రధాన పాత్రలలో దివ్య నటించారు. వారినా హుస్సేన్, ప్రియా వారియర్, పెరల్ వి పూరి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment