
Manchu Lakshmi Accident Photos Viral On Social Media: నటి మంచు లక్ష్మీ గాయాలపాలైంది. చేతివేళ్లు, మోకాలికి తగిలిన దెబ్బలతో అల్లాడిపోతూ ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులు అసలు మంచు లక్ష్మీకి ఏమైందంటూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఫ్యాన్స్ నుంచి వరుసగా మెసేజ్‌లు వస్తుండటంతో జరిగిన విషయాన్ని వివరించింది మంచు లక్ష్మీ.
నిజానికి ఇది రియల్ యాక్సిడెంట్ కాదు. రీల్ యాక్సిడెంట్. అంటే సినిమా షూటింగ్‌లో భాగంగా తీసిన ఫోటో అనమాట. ప్రస్తుతం మంచు లక్ష్మీ మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో భాగంగా ఓ ఫైట్ సీన్ కోసం తీసిన మేకప్‌ను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది.
దీంతో ఆమెకు నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందేమోనని అభిమానులు సహా పలువురు నెటిజన్లు కంగారు పడ్డారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టిన లక్ష్మీ.. తనపై చూపిస్తున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేసింది. అది నిజంగా జరిగిన యాక్సిడెంట్ కాదని, కేవలం ఓ షూటింగ్‌లో భాగంగా తీసిన స్టిల్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది.