కుత్బుల్లాపూర్: చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.. ఇటీవల నిశ్చితార్ధం రద్దైంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన శారద(41) భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం సుచిత్రబ్యాంక్ కాలనీకి వచ్చి నివసిస్తోంది.
ఈమెకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె దివ్య (19) ఇంటర్ పూర్తి చేసింది. సంవత్సరం కిందట దివ్యకు నిశ్చితార్ధం జరుగగా అనివార్య కారణాల వల్ల రద్దైంది. దీంతో ఆమె మానసికంగా కుంగిపోతూ వస్తోంది. మంగళవారం తల్లి శారద అంబర్‌పేటలో ఉంటున్న తన చెల్లెలు ఇంటికి వెళ్లగా.. తమ్ముడు మేడ్చల్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
విషయం తెలియని శారద బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుంది. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా దివ్య అపస్మారక స్థితిలో ఉంది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిశ్చితార్థం రద్దైందని..
Published Wed, Sep 7 2016 9:16 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement
Advertisement