engagement cancellation
-
భవ్య బిష్ణోయ్‌కు షాకిచ్చిన హీరోయిన్ మెహ్రీన్, పెళ్లి క్యాన్సిల్
Mehreen Pirzada Calls Off Engagement: హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తాజాగా ప్రటించింది. మార్చిలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఈ జంట కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి వాయిదా పడటంతో మెహ్రీన్ తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని అని అందరూ భావిస్తుండగా తన నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్నట్లు ప్రకటించి మెహ్రీన్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ‘భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు , భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం నా మనసు చెప్పింది విన్నాను. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని, అలాగే నా ప్రైవసీకి గౌరవిస్తారని ఆశిస్తున్న. ఇక యదావిధిగా షూటింగ్‌పై దృష్టి పెట్టానుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసి తన అభిమానులు, ఫాలోవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదైనలో మెహ్రీన్ పోస్టుపై స్పందిస్తున్నారు. pic.twitter.com/OD2p8ZKOpJ — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021 -
నిశ్చితార్థం రద్దైందని..
కుత్బుల్లాపూర్: చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.. ఇటీవల నిశ్చితార్ధం రద్దైంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన శారద(41) భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం సుచిత్రబ్యాంక్ కాలనీకి వచ్చి నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె దివ్య (19) ఇంటర్ పూర్తి చేసింది. సంవత్సరం కిందట దివ్యకు నిశ్చితార్ధం జరుగగా అనివార్య కారణాల వల్ల రద్దైంది. దీంతో ఆమె మానసికంగా కుంగిపోతూ వస్తోంది. మంగళవారం తల్లి శారద అంబర్‌పేటలో ఉంటున్న తన చెల్లెలు ఇంటికి వెళ్లగా.. తమ్ముడు మేడ్చల్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలియని శారద బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుంది. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా దివ్య అపస్మారక స్థితిలో ఉంది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి రద్దు చేసుకుంటే.. తప్పదు భారీ మూల్యం
నిశ్చితార్థం అయిన తర్వాత.. అమ్మాయి నచ్చలేదనో, మరేదైనా కారణం వల్లో దాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక మీదట భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయం ఢిల్లీలోని ఓ కుటుంబానికి మూడేళ్ల తర్వాత తెలిసొచ్చింది. 2012 సంవత్సరంలో ఓ ప్రభుత్వ వైద్యుడు తన కొడుకును మహారాష్ట్రలోని థానెకు చెందిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయనుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థాన్ని ఆ అమ్మాయి కుటుంబం చాలా ఘనంగా చేసింది. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా వచ్చారు. కానీ.. అమ్మాయి గురించిన నిజాలు సరిగా చెప్పకుండా దాచిపెట్టారని ఆరోపిస్తూ.. అబ్బాయి కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నారు. దాంతో ఒళ్లు మండిన అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిపైన, అతడి తండ్రిపైన ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టారు. థానె కోర్టులో విచారణ జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులకు ఖర్చుల కింద లక్షన్నర చెల్లించాలని కోర్టు సూచించింది. అయితే, తాము రూ. 4.50 లక్షలు ఖర్చుపెట్టామని అబ్బాయి తల్లిదండ్రులు వాదించారు. కానీ, అమ్మాయి కుటుంబానికి డబ్బు కట్టాల్సిందేనని కోర్టు చెప్పడంతో.. ఆ డబ్బు చెల్లించారు. అయినా అమ్మాయి తరఫు వాళ్లు కేసు ఉపసంహరించుకోలేదు. కేసు కొట్టేయాలంటూ అబ్బాయి తరఫు వాళ్లు బాంబే హైకోర్టుకు వెళ్లినా, అక్కడా చుక్కెదురైంది. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అమ్మాయి కుటుంబానికి పరిహారం కడితే సరిపోతుందని.. ఇందులో మోసం చేయడం ఏమీ లేదని జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చెప్పింది.