
Mehreen Pirzada Calls Off Engagement: హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తాజాగా ప్రటించింది. మార్చిలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఈ జంట కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి వాయిదా పడటంతో మెహ్రీన్ తన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని అని అందరూ భావిస్తుండగా తన నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్నట్లు ప్రకటించి మెహ్రీన్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
‘భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు , భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం నా మనసు చెప్పింది విన్నాను. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని, అలాగే నా ప్రైవసీకి గౌరవిస్తారని ఆశిస్తున్న. ఇక యదావిధిగా షూటింగ్‌పై దృష్టి పెట్టానుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసి తన అభిమానులు, ఫాలోవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదైనలో మెహ్రీన్ పోస్టుపై స్పందిస్తున్నారు.
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) July 3, 2021
Comments
Please login to add a commentAdd a comment