తమిళనాడు సంప్రదాయక క్రీడైన ‘జల్లికట్టు’ను అనుమతించాలంటూ అహింసాత్మకంగా ఆందోళన ప్రారంభించిన తమిళ ప్రజలు ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ హింసకు దిగుతున్నారు. తమిళనాడు ప్రజలు సోమవారం బస్సులను తగులబెట్టడంతోపాటు చెన్నై నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. వారి ఆందోళనకు జడిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ఆదివారం మధురై సమీపంలోని అలంగనల్లూరు వద్ద ‘జల్లికట్టు’ను ప్రారంభించలేక పోయిన విషయం తెల్సిందే.