jallikattu protests
-
జల్లికట్టు హీరోలకు ఝలక్
సాక్షి, చెన్నై : ఈ యేడాది మొదట్లో మెరీనా బీచ్‌లో తమిళ తంబీలు నిర్వహించిన జల్లికట్టు ఉద్యమం దేశ్యాప్తంగా ప్రకంపలను పుట్టించింది. కేంద్రంలో కదలిక రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే జనవరి4న ప్రశాంతంగా మొదలైన ఈ ఉద్యమం.. 23వ తేదీన పోలీసుల లాఠీ ఛార్జీతో తీవ్ర ఆందోళనగా రూపాంతరం చెందింది. ఆ సందర్భంగా చెలరేగిన హింసపై దర్యాప్తునకు జస్టిస్ రాజేశ్వరన్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1951 మందిని విచారించిన ఈ కమిటీ సుమారు 447 మందికి సమ్మన్లు జారీ చేసేందుకు సిద్ధమైపోయింది. నిరసనలో పాల్గొన్న కోలీవుడ్ నటులకు కూడా వీటిని జారీ చేయనున్నట్లు న్యాయమూర్తి రాజేశ్వరన్ తెలిపారు. సూర్య, కార్తీ, శివకార్తీకేయన్, రాఘవ లారెన్స్, నయనతార వీరితోపాటు విజయ్ కూడా రహస్యంగా మెరీనా బీచ్‌కు వెళ్లి ఆందోనకారులకు మద్దతు ప్రకటించారు. దీంతో వీరిందరికీ సమన్లు జారీ కానున్నాయి. మరోవైపు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ తదితర స్టార్ హీరోలు నడిగర్ తరపున ఓ సమావేశం నిర్వహించి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. -
జల్లికట్టు ఎఫెక్ట్: మెట్రో రైలెక్కిన క్రికెటర్
ఎప్పుడూ విమానాలు లేదా మంచి ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉండే క్రికెటర్లు ఉన్నట్టుండి సిటీ బస్సులోనో, మెట్రోరైల్లోనో వెళ్లాల్సి వస్తే ఎలా ఉంటుంది? జల్లికట్టు నిరసనలు జోరుగా జరుగుతున్న చెన్నై నగరంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పటివరకు టెస్ట్, వన్డే సిరీస్‌లతో విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడిన చెన్నై బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. టి-20 సిరీస్‌లో విశ్రాంతి దొరకడంతో సొంతూరికి వెళ్లాడు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఇంటికి వెళ్లడం అసాధ్యం కావడంతో మెట్రోరైలు ఎక్కాడు. ''ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజారవాణా ఉపయోగించి తీరక తప్పదు. నన్ను సురక్షితంగా రైలు ఎక్కించిన ఎయిర్‌పోర్టు పోలీసులకు కృతజ్ఞతలు'' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. దాంతోపాటు తాను మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను కూడా ట్విట్టర్లో పెట్టాడు. తనను ఇంటికి సురక్షితంగా చేర్చిన అధికారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే సహచర చెన్నైవాసులు కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుని ఉంటారని ఆశిస్తున్నానన్నాడు. Such situations dictate usage of the public transport, thank the airport police for taking me through safely! pic.twitter.com/MbxpikiMHy — Ashwin Ravichandran (@ashwinravi99) 23 January 2017 Thanks to the timely effort of @selvasuha,AC Mr Vijaykumar, @ashwinravi99 was escorted home safely.Sure fellow Chennaites are back home safe — V. Balaji (@cricketbalaji1) 23 January 2017 -
షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన కమల్
-
షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన కమల్
చెన్నై: జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపం దాల్చి హింసాత్మకంగా మారిన నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. జల్లికట్టు ఉద్రిక్తతల నేపథ్యంలో ఏకంగా ఓ పోలీసే ఆటోకు నిప్పు పెడుతున్న వీడియోను స్థానిక చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన ఈ వీడియోను చూసి షాక్ తిన్న సినీ నటులు కమల్ హాసన్, అరవింద్ స్వామి తదితరులు ట్వీట్ చేశారు. ఏంటి ఇది? పోలీసులే ఇలా చేశారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. గతకొన్నిరోజులుగా శాంతియుతంగా సాగిన జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సోమవారం చెన్నై మహానగరం అట్టుడికిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడులు, పోలీసుల లాఠీచార్జీలతో మెరీనా బీచ్ రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసే ఓ చోట స్వయంగా ఆటోకు నిప్పుపెట్టిన వీడియో సంచలనం రేపింది. అయితే, ఈ వీడియోపై పోలీసు అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎవరూ పాల్పడినా చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి కే శంకర్ స్పష్టం చేయగా.. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని, దీనిపై విచారణ జరుపుతామని మరో పోలీసు అధికారి టీకే రాజేంద్రన్ చెప్పారు. -
ఆ ఉద్యమం వెనుక ఐఎస్ఐ?
తమిళనాడులో ఉవ్వెత్తున ఎగసిన జల్లికట్టు ఉద్యమం చాలావరకు అహింసాయుతంగానే సాగినా.. చివర్లో మాత్రం ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఉద్యమాన్ని ఆపేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ ఉద్యమం వెనక ఐఎస్ఐ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ముందంతా కేవలం విద్యార్థులు, యువత మాత్రమే ఉన్న ఈ ఉద్యమంలోకి ఐఎస్ఐ వచ్చిన తర్వాతే హింస చెలరేగిందని ఆయన అన్నారు. నిజాయితీగా ఉద్యమం చేస్తున్నవాళ్లు చాలామంది ఇప్పుడు అక్కడ లేరని.. దానికి బదులు సంఘవిద్రోహ శక్తులు అందులోకి ప్రవేశించాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జల్లికట్టు కోసం తాను ముందునుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని దగ్గరుండి నిషేధించిందని అన్నారు. తాము ముందునుంచి ఆట పట్ల సానుభూతితోనే ఉన్నామని.. అయితే ఇప్పుడు తమకు శాశ్వత పరిష్కారం కావాలని వాళ్లంటున్నారు గానీ, అది ఎక్కడి నుంచి వస్తుందని స్వామి ప్రశ్నించారు. -
గాడి తప్పుతున్న జల్లికట్టు
-
ఉద్యమం ఆపేయండి: రజనీకాంత్
జల్లికట్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి జరిగిన ప్రయత్నాలు, అందులో జరిగిన హింసాత్మక ఘటనలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని వదిలిపెట్టి, ప్రశాంతంగా మెరీనా బీచ్ నుంచి వెళ్లిపోవాలని ఆయన కోరారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న చారిత్రక ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రయత్నాలను అభినందిస్తున్నానంటూ ఆయన ఒక లేఖను ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖ న్యాయవాదులు, రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చినందువల్ల ప్రస్తుతానికి వాళ్ల మాటల మీద గౌరవం ఉంచి, తమ హామీని వాళ్లు నెరవేర్చుకునేవరకు వేచి చూడటమే మంచిదని ఆయన ఆ లేఖలో చెప్పారు. ఈ చారిత్రక ఘటనను కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయని, వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఇన్నాళ్లూగా పడిన కష్టం, చేసిన ప్రయత్నాలు, వాటివల్ల యువతకు వచ్చిన గౌరవం వృథాగా పోకూడదని ఆయన అన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పోలీసు బలగాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా సంయమనం పాటించాలని రజనీకాంత్ కోరారు. pic.twitter.com/twjA7TNPLA — Rajinikanth (@superstarrajini) 23 January 2017 -
గాడి తప్పుతున్న జల్లికట్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సంప్రదాయక క్రీడైన ‘జల్లికట్టు’ను అనుమతించాలంటూ అహింసాత్మకంగా ఆందోళన ప్రారంభించిన తమిళ ప్రజలు ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ హింసకు దిగుతున్నారు. తమిళనాడు ప్రజలు సోమవారం బస్సులను తగులబెట్టడంతోపాటు చెన్నై నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. వారి ఆందోళనకు జడిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ఆదివారం మధురై సమీపంలోని అలంగనల్లూరు వద్ద ‘జల్లికట్టు’ను ప్రారంభించలేక పోయిన విషయం తెల్సిందే. జల్లికట్టు అనుమతికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విజయం సాధించిన తమిళ ప్రజలు అంతటితో ఎందుకు సంతప్తి పడలేకపోతున్నారు. అహింసాత్మకంగా ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆందోళన నిర్వహించిన వారెందుకు ఇప్పుడు హింసామార్గం వైపు మళ్లుతున్నారు? భవిష్యత్తులో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు జల్లికట్టును శాశ్వతంగా అనుమతిస్తూ చట్టం తీసుకరావాలని వారు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రాథమిక స్వరూపాన్ని తప్ప ఎన్నిచట్టాలనైనా, చివరకు రాజ్యాంగ సవరణలనైనా సమీక్షించేందుకు, వాటిని సరిచేయాల్సిందిగా ఆదేశించేందుకు భారత న్యాయవ్యవస్థకు అధికారం ఉంది. అలాంటప్పుడు శాశ్వత చట్టం అంటూ ఏదీ ఉండదు. శాశ్వత పరిష్కారమూ ఉండదు. ఆందోళనకారులకు ఇది ఎంతవరకు తెలుసున్న విషయాన్ని పక్కన పెడితే ‘జనవరి 26, తమిళులకు చీకటి రోజు, భారత గణతంత్య్ర దినోత్సవాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అన్న నినాదాల పోస్టర్లు, అక్కడక్కడ వేలుపిళ్లై ప్రభాకరన్ ఫొటోలు పట్టుకొని మెరీనా బీచ్‌లో తమిళులు ఆందోళన చేస్తుండడం గమనార్హం. దీనర్థం ఆందోళనలోకి తమిళజాతీయవాద శక్తులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. జాతీయవాద శక్తుల్లోకి ఆందోళన వెళ్లినట్లయితే తమిళనాడులో 2009, మే 17 ఉద్యమం, 2013లో జరిగిన విద్యార్థుల ఉద్యమం పునరావతమయ్యే అవకాశం ఉంది. ఆ రెండు సందర్భాల్లో బలమైన ముఖ్యమంత్రులు ఉండడం వల్ల ఆ ఉద్యమాలు సమసిపోయాయి. ఇప్పుడు పన్నీర్ సెల్వం బలమైన నాయకులు కాకపోవడం వల్ల ప్రత్యేక తమిళ ఉద్యమానికి ఇదే సరైన సమయమని తమిళ జాతీయ వాద శక్తులు భావించే అవకాశం ఉంది. హిందీ భాషకు, వేద సంస్కతికి వ్యతిరేకంగా ప్రత్యేక తమిళ ఉద్యమాలు పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. ఉత్తరాది నాయకులు ఎక్కువగా ఉన్న అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీ పార్టీలను వ్యతిరేకించే సంస్కతి తమిళ ప్రజలది. ఎందుకంటే ఉత్తరాది ప్రజలు ఆర్యులని, వారు ద్రావిడులపై దండయాత్ర చేసి దక్షిణాదిని దురాక్రమించుకున్నారన్నది వారి విశ్వాసం. తమిళనాడు చరిత్రలో రెండోసారి దారుణ కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నందున రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతప్తి నెలకొని ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలించినా కావేరీ జలాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయకపోవడం పట్ల కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ, సంస్కతం భాషలను ప్రోత్సహించడం కూడా వారిని కన్నెర్ర చేస్తోంది. తమిళ భాషను అధికార భాషగా గుర్తించాలంటూ వారు ఎప్పటి నుంచో ఆందోళన కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళుల ఆందోళనను సామరస్యంగా పరిష్కరించలేక పోయినట్లయితే మరోసారి జాతీయవాద ఉద్యమం చెలరేగే ప్రమాదం ఉంది. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఉధృతమవుతున్న జల్లికట్టు ఉద్యమం
-
మాట్లాడుతూ భోరుమన్న లారెన్స్!
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్‌లో ఉద్యమిస్తున్న యువతను పోలీసులు బలవంతంగా తరలిస్తుండటంపై ప్రముఖ సినీ నటుడు లారెన్స్ ఆవేదనతో స్పందించారు. మెరీనా బీచ్‌లోని యువతతో చర్చలు జరుపాలని తాము నిన్నరాత్రే నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇంతలోనే పోలీసులు మెరీనా బీచ్‌పై విరుచుకుపడి.. యువతను బలవంతంగా తరలిస్తుండటంతో అక్కడ భయాందోళన రేకెత్తించే వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరీనా బీచ్ నుంచి ఓ మహిళ తనకు ఫోన్ చేసి.. టీవీ చూడమని చెప్పిందని, టీవీ పెట్టి చూస్తే.. పోలీసుల వల్ల మెరీనా బీచ్‌లో ఉన్న యువత భయాందోళనకరంగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మెరీనా బీచ్ వెళ్లేందుకు ప్రయత్నించానని, తాను ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. గంటలోపు ఎట్టిపరిస్థితుల్లో, ఎలాగైనా మెరీనా బీచ్‌కు చేరుకునేందుకు తాను ప్రయత్నిస్తానని, అంతలోపు యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, భయాందోళనకు గురికావొద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సముద్రంలోకి దిగి యువత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుంటే.. గుండె తరుక్కుపోతున్నదని ఆయన కంటతడి పెడుతూ చెప్పారు. ఏది ఏమైనా మీ ప్రాణాలు అన్నింటికంటే ముఖ్యమైనవని, యువత ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. -
తగలబడుతున్న చెన్నై!
-
తగలబడుతున్న చెన్నై!
పోలీసు వాహనాలకు నిప్పు భగ్గుమన్న ఆందోళనకారులు తమిళనాట అంతటా అదుపు తప్పుతున్న నిరసనలు ఉధృతమవుతున్న జల్లికట్టు ఉద్యమం చెన్నై: తమిళనాట జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపు దాలుస్తోంది. హింసాత్మకంగా మారుతోంది. మెరీనా బీచ్‌లోని ఆందోళన చేస్తున్న యువతను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు చేయి దాటాయి. తమిళనాడు అంతటా నిరసనలు అదుపు తప్పుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు జల్లికట్టు ఉద్యమానికి ముఖ్య కేంద్రమైన మెరీనా బీచ్లోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న ఐస్‌హౌస్ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తగలబడుతున్న పోలీసు వాహనాలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. -
తిరగబడ్డ తమిళయువత.. మంత్రి తరిమివేత!
కోయంబత్తూరు: జల్లికట్టు కోసం తమిళవాసులు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. ఆందోళనకారులను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితులు అదుపుతప్పి హింస నెలకొంటున్నది. కోయంబత్తూరులోని కొడిశా మైదానంలో జల్లికట్టుకు మద్దతుగా నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం హింసాత్మక రూపు దాల్చింది. ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న వారిని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మంత్రి వెలుమణి, పోలీసు కమిషనర్‌తో కలిసి వచ్చారు. వారు నిరసనకారులతో చర్చలకు ప్రయత్నించగా.. వారిని చూసిన వెంటనే జనం ఊగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు. వెనుకకు వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తూ దాడులకు దిగారు. మంత్రి వెలుమణి, పోలీసు కమిషనర్ వాహనాలపై రాళ్లతో, కర్రలతో దాడులు చేసి తరిమేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి వాహనంపై దాడులకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. -
తిరగబడ్డ తమిళ యువత మంత్రి తరిమివేత!
-
జల్లికట్టు.. కొనసాగుతున్న టెన్షన్!
అసెంబ్లీ నుంచి డీఎంకే, కాంగ్రెస్ వాకౌట్.. సభ ముందుకు జల్లికట్టు బిల్లు చెన్నై: తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న వేలాదిమంది యువతను బలవంతంగా అక్కడినుంచి తరలించి.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొంది. జల్లికట్టుపై శాశ్వతంగా నిషేధం ఎత్తివేసేవరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. మానవహారంగా ఏర్పడి పోలీసులను వారు ప్రతిఘటిస్తున్నారు. మరోవైపు జల్లికట్టుపై నిషేధం ఎత్తివేత బిల్లును ప్రవేశపెట్టేందుకు తమిళనాడు అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగియగానే ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి మేరినా బీచ్‌లో ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని స్టాలిన్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మరికాసేపట్లో జల్లికట్టు బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. -
‘జల్లికట్టు’ స్ఫూర్తితో కేంద్రంపై యుద్ధం
సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి తమిళనాడు ప్రజల స్ఫూర్తితో అందరం కలసి పోరాడుదామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కేవలం మూడు రోజుల ఉద్యమంతో తమిళులు తమ డిమాండ్‌ను సాధించుకున్నారని, మనం మూడేళ్లయినా విభజన హామీలు సాధించుకోలేకపోయామని లేఖలో పేర్కొన్నారు. (లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి ప్రజా ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిందేనన్న విషయం జల్లికట్టు విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాసాధనకు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. -
చరిత్ర హీనులుగా మిగిలిపోతాం
-
ముంబైలోనూ జల్లికట్టు ఆందోళనలు
-
ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు
-
ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు
జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా చెన్నై మెరీనా బీచ్‌లో ప్రదర్శనకారులు వెనక్కి వెళ్లలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు మానలేదు. అంతా ఓకే అనుకున్నా కూడా ఎందుకలా జరుగుతోంది? వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాలామందికి అనుమానాలున్నాయి. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకు మాత్రమే ఏదో కంటి తుడుపు చర్యగా ఈ ఆర్డినెన్సు జారీ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఆట కోసం ఆర్డినెన్స్) అందుకే.. ఆర్డినెన్సు కాపీ తమకు చూపించడంతో పాటు.. రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని, ఆ తర్వాత మాత్రమే తాము ఇక్కడినుంచి కదిలి వెళ్తామని మెరీనా బీచ్‌లో గత ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న యువత చెబుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో శనివారం నాడు ఒక్కరోజు నిరాహార దీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పార్టీ అగ్రనేతలు ఎంకే స్టాలిన్, కనిమొళి కూడా స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం నిర్వహించిన రైల్ రోకోలో కూడా వీళ్లిద్దరూ పాల్గొన్నారు. -
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
-
పట్టాల మీదకు వెళ్లిన స్టాలిన్, కనిమొళి
-
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు
-
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?
జల్లికట్టు ఆటలో ఎద్దులను హింసిస్తారని, వాటి తోకలు కొరికి.. కర్రలతో బాది వాటిని పరుగులు తీయిస్తారని పెటా లాంటి జంతుహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మూగ జీవాలను హింసించే ఇలాంటి ఆటలను నిషేధించాలని కోర్టుకెక్కాయి. కానీ, తమిళుల వాదన మరోలా ఉంది. తాము ఆవులు, ఎద్దులను ఎంతగానో ప్రేమిస్తామని, కన్న బిడ్డల్లా చూసుకుంటామని.. అలాంటి వాటిని తాము ఎందుకు హింసిస్తామని అడుగుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్లో ఒక వీడియో షేర్ చేశారు. ఒక చిన్న పిల్లాడు ఎద్దుతో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. అందకపోయినా కాళ్లెత్తి మరీ దాని కొమ్ములు పట్టుకుని కిందకు వంచి, గంగడోలుతో ఆడుకుని, చెవులు నిమురుతూ.. ఎంతలా దాన్ని అటూ ఇటూ తిప్పినా కొమ్ములు తిరిగిన ఆ ఎద్దు ఏమీ చేయకుండా ఊరుకుంటుంది. పిల్లాడితో ఆడుకున్నట్లుగానే కనిపిస్తుంది. తమిళనాడులో పశువుల పెంపకం ఒక మంచి సంస్కృతి అని, ఆవులు.. ఎద్దులతో తాము ఇలాగే స్నేహపూర్వకంగా ఉంటామని, అందువల్ల జల్లికట్టును సంస్కృతిలో భాగంగానే చూడాలని అంటున్నారు. స్పెయిన్‌లో జరిగే బుల్ఫైట్లలా కాకుండా, ఇక్కడ బహిరంగ స్థలంలో ఎడ్లను స్వేచ్ఛగా పరుగులు తీయనిస్తామని చెబుతున్నారు. ఈ వీడియో చూస్తే మాత్రం పశువుల పట్ల తాము ఎలా ఉంటామో, అవి తమతో ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తుందని చెబుతున్నారు. చిన్నతనంలో తాను తమ ఇంట్లో ఉండే పశువులన్నింటినీ పేర్లుపెట్టి పిలవడం తనకు ఇంకా గుర్తుందని కూడా విక్రమ్ ప్రభు ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. -
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు: సీఎం
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు నిర్వహించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని, అందువల్ల నిరసనకారులు వెంటనే తమ నిరసన ప్రదర్శనలను విరమించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. జల్లికట్టు ఆందోళనలకు నడిగర సంఘం మద్దతు పలకడం, ఏఆర్ రెహ్మాన్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించడం, డీఎంకే నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకోలు మొదలవ్వడం లాంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి సవరణలు తెచ్చే విషయమై రాజ్యాంగ నిపుణులతో వివరంగా చర్చించామని సీఎం అన్నారు. సవరణ ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం ఈరోజు ఉదయమే కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపిందని, దానికి ఒకటి రెండు రోజుల్లోనే అనుమతి వచ్చి, జల్లికట్టుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సవరణ ముసాయిదా విషయాన్ని చర్చించేందుకు వీలుగా రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. పట్టాల మీదకు వెళ్లిన స్టాలిన్, కనిమొళి డీఎంకే నేతృత్వంలో జల్లికట్టు ఆందోళనలకు మద్దతుగా రైల్ రోకో ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళి తదితరులు కూడా ప్రత్యక్షంగా ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. మాంబళం రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైల్‌రోకోలో స్టాలిన్ పాల్గొనగా, ఎగ్మూర్ స్టేషన్‌కు కనిమొళి వెళ్లారు. -
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?
-
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగో రోజు కూడా చెన్నై మెరీనాబీచ్‌లో నిరసనకారులు అలాగే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలోనూ అక్కడినుంచి కదల్లేదు. మరోవైపు జల్లికట్టుకు మద్దతుగా ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. విద్యార్థులు మొదలుపెట్టిన ఈ నిరసన కాస్తా ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. లాయర్లు, నటులు, కళాకారులు, ఐటీ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వాళ్లు వీటిలో పాల్గొంటున్నారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము ధిక్కరించలేమని, ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డినెన్సు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేయడంతో నిరసనలు మరింత తీవ్రతరమయ్యాయి. రెహ్మాన్ ఇప్పటికే తన నిరాహార దీక్ష విషయాన్ని ప్రస్తావించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన అభిమానులకు పిలుపునిస్తారని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కమల్‌హాసన్ కూడా వ్యక్తిగతంగా జల్లికట్టు ఉండాల్సిందేనని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఆధ్యాత్మిక గురువులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ లాంటి వాళ్లు కూడా నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. జల్లికట్టు అనేది తమిళ సంస్కృతిలో భాగమని, అది సంక్రాంతి పండుగ సంబరాల్లో అంతర్భాగమని అన్నారు. జల్లికట్టుకు తాను మద్దతిస్తున్నానని, నిరసనలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని రవిశంకర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో సరైన వాస్తవాలతో మరో తాజా అప్పీలు దాఖలు చేద్దామన్నారు. జంతువులకు పండుగను అంకితం చేసే ఉత్సవం లాంటిదే జల్లికట్టు అని, ప్రజల సాంస్కృతిక బలాన్ని తీసేసుకుంటామంటే కుదరదని, ముఖ్యంగా పల్లెల్లో ఇవి చాలా ముఖ్యమని జగ్గీ వాసుదేవ్ అన్నారు. దారిలోనే ఉంది.. రెడీగా ఉండండి అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం జల్లికట్టుకు అందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. 'బిగ్ డే' దారిలోనే ఉందని అందులో చెప్పారు. మరి అది ఎలా సాధ్యం అవుతుందో మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే, జల్లికట్టు మంచి సంప్రదాయమే అయినా అది సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున దాని గురించి ఏమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. మరి పన్నీర్‌కు ఏరకమైన సూచన వచ్చిందో, జల్లికట్టు గురించి ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాల్సి ఉంది. I'm fasting tomorrow to support the spirit of Tamilnadu! — A.R.Rahman (@arrahman) 19 January 2017 The way the #jallikattu protests are being held in peace is a lesson for the whole world. May everyone continue to maintain peace. — Mohammad Kaif (@MohammadKaif) 20 January 2017 Get ready for #Jallikattu The big day is on the way. — O. Pannerselvam (@CMOTamilNadu) 19 January 2017 The Tamilnadu Govt can itself issue an Ordinance to legalise #Jallikattu. @CMOTamilNadu should not bother about the Central Govt. RT pic.twitter.com/Spfm6nARpH — Markandey Katju (@mkatju) 19 January 2017