జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా చెన్నై మెరీనా బీచ్‌లో ప్రదర్శనకారులు వెనక్కి వెళ్లలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు మానలేదు. అంతా ఓకే అనుకున్నా కూడా ఎందుకలా జరుగుతోంది? వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాలామందికి అనుమానాలున్నాయి.