
సాక్షి, చెన్నై : ఈ యేడాది మొదట్లో మెరీనా బీచ్‌లో తమిళ తంబీలు నిర్వహించిన జల్లికట్టు ఉద్యమం దేశ్యాప్తంగా ప్రకంపలను పుట్టించింది. కేంద్రంలో కదలిక రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది.
అయితే జనవరి4న ప్రశాంతంగా మొదలైన ఈ ఉద్యమం.. 23వ తేదీన పోలీసుల లాఠీ ఛార్జీతో తీవ్ర ఆందోళనగా రూపాంతరం చెందింది. ఆ సందర్భంగా చెలరేగిన హింసపై దర్యాప్తునకు జస్టిస్ రాజేశ్వరన్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1951 మందిని విచారించిన ఈ కమిటీ సుమారు 447 మందికి సమ్మన్లు జారీ చేసేందుకు సిద్ధమైపోయింది.
నిరసనలో పాల్గొన్న కోలీవుడ్ నటులకు కూడా వీటిని జారీ చేయనున్నట్లు న్యాయమూర్తి రాజేశ్వరన్ తెలిపారు. సూర్య, కార్తీ, శివకార్తీకేయన్, రాఘవ లారెన్స్, నయనతార వీరితోపాటు విజయ్ కూడా రహస్యంగా మెరీనా బీచ్‌కు వెళ్లి ఆందోనకారులకు మద్దతు ప్రకటించారు. దీంతో వీరిందరికీ సమన్లు జారీ కానున్నాయి. మరోవైపు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ తదితర స్టార్ హీరోలు నడిగర్ తరపున ఓ సమావేశం నిర్వహించి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment