
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంది. అయితే, తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ తన అక్క రేవతి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో తన సోదరితో ఆమెకు ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంది. నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తెగా కీర్తి సురేశ్ 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తెలుగులో 'నేను శైలజ' సినిమాతో పరిచయం అయింది.

కీర్తి అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్‌కి కాదు.. షార్ట్ ఫిల్మ్ కోసం కావడం విశేషం. అయితే, నేడు తన పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు చెబుతూ కీర్తి ఇలా పోస్ట్ షేర్ చేసింది. 'నా ఒడిదుడుకుల సమయంలో నా చుట్టూ ఒక గోడలా నిలబడ్డావు. వాటిని నేను అధిగమించేందుకు నాకు అండగా నిలిచావు. నువ్వు నా పక్కన ఉంటే చాలు.. ఈ జీవితం చాలా సులువుగా ఉంటుంది. బహుశా నాకు అత్యంత ఇష్టమైన తోబుట్టువు నువ్వే అనుకుంటా' అంటూ ఒక స్మైలీ ఎమోజీని చేర్చి తన అక్కపై ఉన్న ప్రేమను కీర్తి పంచుకుంది.
కీర్తి తల్లి మేనక నటి కాగా, ఆమె నాన్న సురేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కీర్తి అక్క రేవతి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా కొద్దిరోజుల క్రితం వారు షేర్ చేశారు. రేవతి కూడా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. చెన్నై శస్త్ర యూనివర్సిటీలో ఫిలిం కోర్సులో మాస్టర్స్ పట్టా అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment